How to Pay AP House Tax in Swarna Panchayat Site

How to Pay AP House Tax in Swarna Panchayat Site

AP House Tax Payment Process in Mobile –  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు [ మినహాయింపు ఉన్నవారు మినహా ] ప్రతి ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఒకసారి ఇంటి పన్ను [ AP House Tax Payment ] తప్పనిసరిగా కడుతూ ఉంటారు. దానికిగాను మీ పంచాయతీ కార్యదర్శి [ Panchayat Secretary ]  మీ ఇంటి వద్దకు వచ్చి ఇంటి పన్నును వసూలు చేసి మీకు రసీదును ఇంతకాలం ఇస్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎవరికి వారు సొంతంగా మొబైల్ లోనే ఆన్లైన్ లో QR Code Pay / Phone Pay / UPI pay / Credit Card / Debit Card వంటి పేమెంట్ ఆప్షన్ల ద్వారా ఇంటి పన్ను [ AP House Tax Payment ]  కట్టే సదుపాయాన్ని కట్టుకునే సదుపాయాన్ని కల్పించింది .  

అయితే ఇంటి పన్ను కట్టే ముందు అసలు మీకు ఎంత పన్ను ఈ సంవత్సరం కట్టాలో తెలుసుకోవడం ముఖ్యం. అందుకుగాను మీకు కొత్త అసెస్మెంట్ నెంబరు / ఓనర్ పేరు / ఇంటి నెంబరు / పాత అసెస్మెంట్ నెంబరు తెలిసి ఉండాలి. మీరు ఎంత ఇంటి పన్ను బకాయి ఉన్నారో తెలుసుకునే ప్రాసెస్

Know AP House Tax Amount & Pay House Tax In Mobile 

Step 1: ముందుగా కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయండి 

Step 2: కింద చూపించిన వివరాలను నమోదు చేయండి

Financial Year: 2024-25 ను ఎంచుకోండి

District: మీ జిల్లా నేర్చుకోండి

Mandal: మీ మండలాన్ని ఎంచుకోండి

Panchayat: మీ పంచాయతీ ను ఎంచుకోండి

Village: మీ గ్రామాన్ని ఎంచుకోండి

Select Your Choice: లో కింద చూపించిన ఆప్షన్లు కనిపిస్తాయి

  • Assessment Number 
  • Owner Name 
  • Door No 
  • Old Assessment Number

పై నాలుగింటిలో సులువుగా మీ ఇంటిని గుర్తించేందుకు ⊚ Owner Name  ను సెలెక్ట్ చేసుకోండి. మీ పేరులో ఇంటి పేరు మొదటి 3 లేదా 4 లెటర్లను ఎంటర్ చేసి  Search  పై క్లిక్ చేస్తే  ఆ గ్రామంలో ఇంటి పేరుతో ఉన్న పేర్లన్నీ చూపిస్తాయి అందులో మీ పేరు పక్కన  View Due & Pay   అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి .  

2024-25  సంవత్సరంలో Current లో చివరన ఉన్న House Tax లో ఉన్న నగదును పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా గత సంవత్సరము ఏదైనా బకాయిలు ఉన్నట్టయితే వాటితో కలిపి చూపించడం జరుగుతుంది .

How To Pay AP House Tax Amount Online 

పైన ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే పేమెంట్ చేయాలో వారిని పైన చెప్పిన విధానం ద్వారా కనుక్కొని  View Due & Pay  పై క్లిక్ చేయాలి .  Select Year పై క్లిక్ చేసి Mobile Number  వద్ద మీ నెంబర్ నమోదు చేయండి [ SMS వస్తుంది ] , తరువాత  Proceed For Payment  పై క్లిక్ చేయండి . 

Are You Sure You Want to Proceed ? అని వస్తుంది అప్పుడు  Proceed to Pay  పై క్లిక్ చేయాలి . 

తర్వాత House Tax Payment Page ఓపెన్ అవుతుంది . మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలో ఆప్షన్ ని ఎంచుకోవాలి . యూపీఐ లేదా ఫోన్ పే వంటి యాప్ ద్వారా పేమెంట్ చేయాలి అంటే చివరగా ఉన్న  UPI  ఆప్షన్ ఎంచుకోవాలి .

⊚UPI ID  ద్వారా పేమెంట్ చేయాలి అంటే మొదటి ఆప్షన్ ను, QR Code స్కాన్ చేసి పేమెంట్ చేయాలి అంటే రెండు ఆప్షన్ను సెలెక్ట్ చేసి  Confirm  చేయాలి .

QR Code  ద్వారా పేమెంట్ అయితే కింద చూపిన విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మీ మొబైల్ లో ఉన్న ఏదైనా Payment App ఓపెన్ చేసి Scan చేసి పేమెంట్ పూర్తి చేయాలి .

అదే UPI ID ద్వారా పేమెంట్ చేయాలంటే మొదటి ఆప్షన్ ఎంచుకొని Confirmపై క్లిక్ చేసిన తర్వాత UPI ID అడుగుతుంది మీ Phone Pay లేదా Gpay లేదా ఏదైనా పేమెంట్ యాప్ లో ఓపెన్ చేసి అక్కడ UPI ID ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే లేదా మాన్యువల్ గా ఎంటర్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీ యొక్క Payment App కు  మెసేజ్ వస్తుంది అక్కడ నుండి నేరుగా మీరు పేమెంట్ పూర్తి చేస్తే సరిపోతుంది .

Payment పూర్తి చేయాలి .

Payment పూర్తి చేసాక  మీరు మొదట ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు పేమెంట్ పూర్తి అయినట్టు మరియు పేమెంట్ రసీదు యొక్క లింక్ ఆంధ్రప్రదేశ్ అధికారిక పేరు అనగా AP Govt నుండి వస్తుంది .

పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు AP House Tax Payment Receipt PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది .

 హౌస్ టాక్స్  పేమెంట్ ప్రాసెస్ లో మీ పేరు లేకపోయినా లేదా ఎక్కువ అమౌంట్ చూపిస్తున్న ప్రాపర్టీ వివరాలు తప్పుగా ఉన్న దయచేసి పేమెంట్ చేయకుండా మీ పంచాయతీ కార్యదర్శి వారిని నేరుగా కాంటాక్ట్ అవ్వండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page