ఆర్థిక సంవత్సరానికి గానూ రిటర్నులు దాఖలు చేసిన కొందరికి రిఫండ్‌లు (ITR Refund) కూడా క్రెడిట్ అవుతున్నాయి. అయితే మరికొందరేమో ఎప్పుడెప్పుడు ఖాతాలో అమౌంట్ పడుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు. ఒక వేళ మీరు కూడా రిఫండ్ అమౌంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ రిఫండ్ స్టేటస్‌ను చెక్ చేసుకోవటం ద్వారా మీ అమౌంట్ ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవచ్చు.
రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?
- ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-పైలింగ్ ట్యాక్స్ పోర్టల్‌కు వెళ్లండి.
- యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- ‘Income tax returns’ లోకి వెళ్లి ‘View Filed Returns’ పై క్లిక్ చేయాండి.
- అందులో ‘View Details’ ఆప్షన్‌ను ఎంచుకోగానే ‘Status of Tax Refunds’ ట్యాబ్‌కు తీసుకెళ్తుంది.
- అందులో పేమెంట్ మెథడ్, రిఫరెన్స్ నంబర్, కరెంట్ స్టేటస్‌తో పాటు రీఎంబర్స్‌మెంట్ స్టేటస్ మోడ్ కనిపిస్తాయి.
ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
- రిఫండ్ స్టేటస్ కోసం NSDL పోర్టల్లోని ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ పాన్ కార్డ్ నంబర్ లేదా ట్యాన్ నంబర్‌లో మీకు అందుబాటులో ఉన్న దాన్ని ఎంచుకొని ‘proceed’ పై క్లిక్ చేయాలి.
- అందులో పాన్ కార్డ్ నంబర్/ట్యాన్ నంబర్ ఎంటర్ చేసి మదింపు సంవత్సరాన్ని ఎంచుకొని కనిపిస్తున్న క్యాప్చాను ఎంటర్ చేయాలి.
- ‘Submit’ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ మీకు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
Leave a Reply