రాష్ట్రంలోని సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి మరియు బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఆధార అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే చాలామందికి వాళ్ళ ఆధార్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ కి లింక్ అయిందో లేదో తెలియదు. కొంతమందికి ఇంకా ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అన్న విషయం కూడా తెలియదు.
ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ద్వారా ఆఫ్లైన్ సెంటర్లో చుట్టూ తిరగనవసరం లేకుండా మన మొబైల్ లోని ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని సర్వీస్ అందుబాటులో ఉంది. సచివాలయంలో మాత్రమే కాకుండా మీ సేవ ఆధార్ సెంటర్ మరియు కొన్ని బ్యాంకులలో ఈ సదుపాయం కలదు.
ఈ ఆర్టికల్లో మనం ఆధార్ నంబర్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకునే పూర్తి విధానం గురించి తెలుసుకుందాం.
Steps to Know Aadhar Linked Mobile Number
ముందుగా కింద ఇవ్వబడిన ఆధార్ లింకును క్లిక్ చేయండి.
ఆధార్ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత కింది విధంగా ఆధార్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

ఆధార్ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే సర్వీసెస్ సెక్షన్లో చెక్ ఆధార్ వాలిడిటీ అనే ఆప్షన్ ఉంటుంది.

Check Aadhaar Validity అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత పేజీ ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ నంబర్ మరియు captcha డీటెయిల్స్ నమోదు చేయాల్సి ఉంటుంది

మొదటిగా మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి.

తర్వాత పక్కనున్న ఇమేజ్ లో కనిపిస్తున్న Captcha కోడ్ ని ఎంటర్ చేసి Proceed బటన్ పైన క్లిక్ చేయండి

Proceed బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ చివరి మూడు అంకెలు చూపించడం జరుగుతుంది. దీనితో పాటుగా మీ వయస్సు, Gender ,మరియు రాష్ట్ర వివరాలు కూడా చూపిస్తాయి

Leave a Reply