గమనిక:- వైఎస్ఆర్ భీమా కి సంబంధించి పాలసీధారుని పేరు మరియు నామిని వివరాలు చెక్ చేసుకుని ఉండాలి.
“త్వరలో 2023-24 సం.కు సంబంధించిన భీమా రీసర్వే వాలంటీర్ ద్వారా జరుగును కావున మీ భీమా స్టేటస్ ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకుని తప్పులు ఉన్నట్లయితే (నామిని మార్చాలి అన్నా, పాలసీ దారులను మార్చాలి అన్నా, కొత్తగా భీమా నమోదు చేయాలన్నా) మీ వాలంటీర్లకు తెలియజేయగలరు.”
YSR భీమా కుటుంబం లో ఒకరికి మాత్రమే వర్తించును మీ కుటుంబంలో ఎవరికి ఈ వైఎస్ఆర్ భీమా వర్తిస్తుందో తెలుసుకొనుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యవలెను.
YSR భీమా స్టేటస్ మూడు విధాలుగా చెక్ చెయ్యవచ్చు
- రైస్ కార్డ్ నంబర్ ద్వారా
- ఆధార్ నంబర్ ద్వారా
- పేరు ద్వారా (జిల్లా,మండలం, సెక్రటేరియట్ ఎంచుకుని)
పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అగును.
ఆధార్ నంబర్ ద్వారా భీమాస్టేటస్ తెలుసుకొనే విధానం (Search By Aadhar Number)
ఆధార్ నంబర్ ద్వారా పాలసీ దారుని వివరాలు చూడటానికి Search By Aadhar మీద క్లిక్ చేసి కుటుంబంలో ఎవరికి అయితే పాలసీ చేసున్నారో వారి యొక్క ఆధార్ నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసినా పాలసీ దారుని వివరాలు వచ్చును. నమోదు చేసిన ఆధార్ నంబర్ కి భీమా పాలసీ నమోదు చేయకపోయినట్లయితే No Details Found అని చూపించడం జరుగుతుంది.
రైస్ కార్డ్ నంబర్ ద్వారా భీమాస్టేటస్ తెలుసుకొనే విధానం ( Search By Rice Card Number)
రైస్ కార్డ్ నంబర్ ద్వారా స్టేటస్ చూడటానికి Search By Rice Card దగ్గర క్లిక్ చేసి Enter Rice Card Number దగ్గర రైస్ కార్డ్ నంబర్ నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసిన ఆ కుటుంబంలో ఎవరికి భీమా నమోదు చేసి వుంది మరియు నామిని వివరాలు ఈ క్రింది విధంగా వస్తుంది.
పేరు ద్వారా భీమాస్టేటస్ (Search By Name)
పేరు ద్వారా స్టేటస్ చూడటానికి Search By Name దగ్గర క్లిక్ చేయవలెను,ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మన జిల్లాను మరియు మండలము మరియు మన సచివాలయం ఎంచుకుని Enter Name దగ్గర పాలసీ దరుని పేరు (ఆధార్ కార్డ్ లో వున్న విధంగా) ను నమోదు చేసి సెర్చ్ చేసిన వివరాలు చూపించడం జరుగుతుంది.
Leave a Reply