AP Ration Card Member Adding Process: AP Ration Card Member Addition కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పుట్టిన పిల్లలు మరియు వివాహమైన మహిళలు రేషన్ కార్డులో చేరవచ్చు. ఈ అవకాశం May 31st వరకు మాత్రమే ఉంటుంది . కాబట్టి ఎవరైతే రేషన్ కార్డులో సభ్యుల చేర్పు కొరకు వేచి ఉన్నారో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో అదే/ రైస్ కార్డులో Add చేసుకుని లబ్ధిని పొందగలరు . ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న ATM కార్డు సైజులో ఉండే AP Smart Ration Card లో మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉండాలన్న తప్పనిసరిగా ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ ద్వారా రేషన్ కార్డు లోకి Add అవ్వాల్సి ఉంటుంది.
AP Ration Card Member Addition Requirements
చిన్నపిల్లలను రేషన్ కార్డులో చేర్చాలంటే తప్పనిసరిగా
- ధ్రువీకరించదగిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఉండాలి,
- ఆధార్ కార్డు ఉండాలి
- ఆధార్ కార్డులో ఉన్న చిరునామా గ్రామానికి చెంది ఉండాలి
- ఆధార్ కార్డులో C/O లో ఉన్న పేరు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల పేరుతో మ్యాచ్ అవ్వాలి
- హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరును నమోదు చేసి ఉండాలి [ సచివాలయంలో ఆప్షన్ ఉంది ]
వివాహమైన మహిళను రేషన్ కార్డులో చేర్చాలంటే తప్పనిసరిగా
- ఆధార్ కార్డు ఉండాలి
- ఆధార్ కార్డులో ఉన్న చిరునామా గ్రామానికి చెంది ఉండాలి
- మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి [ సచివాలయం / రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇచ్చిన ]
- మ్యారేజ్ ఫోటో అందుబాటులో ఉండాలి
- వివాహ సర్టిఫికెట్ లేకపోతే ఆధార్ కార్డులో C/O సెక్షన్ లో భర్త పేరు నమోదు చేసి ఉండాలి
- హౌస్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకుని ఉండాలి
Documents Required For Ration Card Member Addition
For Child Addition into Ration Card
- అప్లికేషన్ ఫారం
- పిల్లల ఆధార్ కార్డు
- పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్
- తల్లిదండ్రుల ఆధార్ కార్డు
- రైస్ కార్డు
For Married Women Addition into Ration Card
- అప్లికేషన్ ఫారం
- వివాహమైన మహిళ ఆధార్ కార్డు
- మ్యారేజ్ సర్టిఫికేట్
- మ్యారేజ్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటో
- రైస్ కార్డ్
Download Application Form For AP Ration Card Member Addition
పిల్లలను రేషన్ కార్డులో Add చేయాలన్న లేదా వివాహం అయిన మహిళను కార్డులో Add చేయాలన్న ఒకటే Ration Card Appliication Form ఉంటుంది. దరఖాస్తు ఫారం లింకు కింద ఇవ్వటం జరిగింది. లింక్ పై క్లిక్ చేసినట్లయితే నేరుగా మీకు ఫారం డౌన్లోడ్ అవుతుంది .
ఫారం ను ప్రింట్ తీసుకున్న తర్వాత కింద చూపించిన విధంగా [ వివాహమైన మహిళను రేషన్ కార్డులో Add చేయుటకు నింపే ఫారం చూపించడం జరిగింది ] Ration Card Application Form నింపి కుటుంబ పెద్ద లేదా దరఖాస్తు చేస్తున్న వారి యొక్క సంతకం చేసి పైన చెప్పిన డాక్యుమెంట్స్ తో మీ గ్రామా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Application Fee For Ration Card Addition
రేషన్ కార్డులో సభ్యులను జోడించాలంటే Ration Card Member Addition Application fee ఫీజు కేవలం 24 రూపాయలు మాత్రమే. ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు .
Ration Card Addition Application Process
రేషన్ కార్డులో సభ్యులను జోడించుటకు ముందుగా పైన చెప్పినటువంటి దరఖాస్తు ఫారం మరియు కావలసిన డాక్యుమెంట్లను మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్న తర్వాత వారు మీకు రసీదును ఇస్తారు. అందులో ఉన్న అప్లికేషన్ నెంబర్తో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయినటువంటి VRO / PS / DA / MP సిబ్బంది GSWS Employees App లాగిన్ లో New Rice Card EKYC అనే ఆప్షన్ లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ చూపించిన వారి బయోమెట్రిక్ ను తీసుకుంటారు.

eKYC ను రాష్ట్రంలో ఏ గ్రామా లేదు వార్డు సచివాలయంలోనైనా పూర్తి చేసుకోవచ్చు . ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్లికేషన్ సంబంధిత VRO వారి AP Seva Login లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ SIX STEP VALIDATION సంబంధించినటువంటి ఫారం ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఏవైనా అనర్హతలు ఉన్నట్టయితే సంబంధిత ఫారం ను దరఖాస్తుదాన్ని సంతకం చేసి VRO వారి లాగిన్ లో అనర్హులని తేల్చినట్టయితే అక్కడితో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది . అర్హులైనట్టయితే అర్హులైన చెప్పి దరఖాస్తు దారిని వద్ద సంతకం తీసుకొని ఆ వారం వారి లాగిన్ లో అప్లోడ్ చేసినట్లయితే అప్పుడు అప్లికేషన్ సంబంధిత మండల రెవెన్యూ అధికారి వారు లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది. మండల రెవెన్యూ అధికారి వారి లాగిన్ లో తుది ఆమోదం అయిన తర్వాత Ration Card Print కు అవకాశం ఉంది . అదే విధముగా ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో ATM Card Sized Smart AP Ration Card లో పేరు నమోదు తో మీకు కార్డు పంపిణీ సచివాలయ సిబ్బంది లేదా విఆర్ఓ వారి ద్వారా జరుగుతుంది. ఈ లోపు మీకు కార్డు అవసరం ఉంటె కింది లింక్ ద్వారా Ration Card PDF Download చేసుకోవచ్చు .
AP Ration Card Application Status
గ్రామ/ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన రసీదులో అప్లికేషన్ నెంబర్ T ట్ తో మొదలైన నెంబర్ తో రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు.

అప్లికేషన్ ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది ఎవరు ఏ రోజున ఆమోదం తెలిపారు అనే వివరాలు ఈ లింకు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ కొరకు కింద లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేయండి .
Know Ration Card Application Status

Leave a Reply