దేశవ్యాప్తంగా 2000 రూపాయలు నోట్లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు లబ్ధిదారులకు డిపాజిట్ లేదా మార్చుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది.
డిపాజిట్ కి సంబంధించి లేదా మార్పిడికి సంబంధించి ఏమైనా ఫారం నింపాలా?
నగదు మార్పిడికి సంబంధించి ఎటువంటి ఫారం నింపాల్సిన అవసరం లేదు అదేవిధంగా దృవీకరణ పత్రం కూడా అవసరం లేదని దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇక తమ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకునేవారు యధావిధిగా ఎప్పటిలాగానే తమ బ్యాంకు పాస్బుక్ తో పాటు డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ ని డిపాజిట్ స్లీప్ మీద నింపాల్సి ఉంటుంది. కొత్తగా ఎటువంటి నిబంధన ఇక్కడ లేదు.
అంతేకాకుండా ఇదివరకే నోట్ల మార్పిడికి సంబంధించి ఏదైనా బ్యాంక్ ఖాతాలో మార్చుకునేటప్పుడు బ్యాంక్ తప్పనిసరిగా ఉండాలని కూడా రూల్ లేదని కూడా RBI గతంలోనే వెల్లడించింది. అయితే మార్చుకునేందుకు మాత్రం కేవలం ఒకసారి కి 20 వేల రూపాయలు మాత్రమే అనుమతిస్తున్నారు.
ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు జనాలు బ్యాంకులకు వెళ్లగా , RBI ప్రకటించిన విధంగా మే 23 నుంచి మాత్రమే మార్పిడికి , డిపాజిట్ కి వెసులుబాటు ఉంటుందని బ్యాంకులు వారిని తిరిగి పంపించడం జరిగింది. అయితే కొంతమంది డిపాజిట్ మిషన్ల ద్వారా ప్రస్తుతం జమ చేస్తున్నారు.
ఇప్పటికే వినియోగదారుల నుంచి షాపుల వద్ద, వివిధ కొనుగోళ్ల వద్ద 2000 నోట్లను తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. సెప్టెంబర్ 30 వరకు లీగల్ టెండర్ గా కొనసాగుతున్నప్పటికీ ప్రజల్లో నెలకొన్న భయాలతో వీటిని తీసుకోవడం లేదు.
Leave a Reply