తెలంగాణలో నోటరీ భూముల రిజిస్ట్రేషన్ కి సంబంధించి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 26న జారీ చేసిన GO 84 ఉత్తర్వులను పై హైకోర్టు స్టే విధించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో మూడు వేల గజాల లోపు ఉన్న నోటరీ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 84 ను జారీ చేయడం జరిగింది.
పట్టణ ప్రాంతాలలో 125 గజాల వరకు నోటరీ స్థలాల క్రమబద్ధీకరణను ఉచితంగా, అంతకంటే ఎక్కువ ఉంటే స్టాంపు డ్యూటీ తో క్రమబద్ధీకరించేందుకు అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులను జారీ చేసింది.
అయితే ఈ జీవో ను సవాలు చేస్తూ భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు స్టాంపులు రిజిస్ట్రేషన్లు సెక్షన్ 9 కి విరుద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకి వచ్చింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు జీవో నెంబర్ 84 అమలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇకనుంచి తిరిగి హైకోర్టు అనుమతించే వరకు నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ తత్కాలికంగా నిలిపివేసినట్లయింది.
Leave a Reply