GSWS Transfers : సచివాలయాల బదిలీల ప్రొసీడింగ్స్ ఎప్పుడంటే.. బరిలో మొత్తం 15,256 మంది, అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు

GSWS Transfers : సచివాలయాల బదిలీల ప్రొసీడింగ్స్ ఎప్పుడంటే.. బరిలో మొత్తం 15,256 మంది, అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు

గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం దరఖాస్తులకు సంబంధించి ప్రాథమికంగా పరిశీలించినటువంటి ప్రభుత్వం అర్హులైనటువంటి వారి మెరిట్ లిస్టు ను జూన్ 6 న విడుదల చేస్తామని ప్రకటించింది.

గ్రామ వార్డు సచివాలయాలలో బదిలీలకు 15,526 మంది

గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు మొత్తంగా 15,526 మంది ఉన్నారు.

వీరిలో జిల్లా లోపల బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు : 13,105 మంది

ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అంతర్ జిల్లా బదిలీలకు అప్లై చేసుకున్న వారు : 2421 మంది

బదిలీలు చేసుకున్న ఉద్యోగుల్లో అత్యధికంగా డిజిటల్ అసిస్టెంట్లు ఉండటం గమనార్హం. మొత్తం బదిలీల దరఖాస్తుల్లో 1976 మంది డిజిటల్ అసిస్టెంట్లు ఉన్నారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా బదిలీలు కర్నూలు జిల్లా నుంచి వచ్చాయి. మొత్తం 1581 మంది ఈ జిల్లాలో ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఒక జిల్లా నుంచి మరొక జిల్లా అనగా అంతర్ జిల్లా బదిలీలలో విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు టాప్ రెండు స్థానాల్లో ఉన్నాయి.

దరఖాస్తు చేసుకున్నవారికి ప్రొసీడింగ్స్ మరియు కౌన్సిలింగ్ ఎప్పుడంటే

సచివాలయాలలో బదిలీలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి వారి అప్లికేషన్స్ ను సోమవారం పరిశీలించడం జరిగింది. పోస్ట్ క్యాటగిరి వారిగా మెరిట్ లిస్ట్ జాబితాను జూన్ 6 రాత్రికి విడుదల చేయనున్నారు.

ఇక అర్హులైన వారికి 8, 9, 10 తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహించి వారు కోరుకున్నటువంటి సచివాలయాల కేటాయింపులకు సంబంధించి ప్రోసిడింగ్స్ జారీ చేయనున్నారు.

You cannot copy content of this page