సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి వస్తున్నాయి. ఈ మేరకు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని, 12, 28 శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించడం జరిగింది. అయితే సిగరెట్, తంబాకు వంటి హానికారక వస్తువులకు కు మాత్రం 40 శాతం ట్యాక్స్ వేయనున్నారు.
జీఎస్టీ (GST) అంటే ఏమిటి? కొత్త GST స్లాబులు ఏమిటి?
మనం కొనే ప్రతి వస్తువుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధిస్తాయి. ఆ పనులన్నీ కలిపి GST రూపంలో వసూలు చేస్తాయి. వస్తువును బట్టి పన్ను రేటు కూడా మారుతుంది. స్లాబుల వారిగా ఈ పన్ను ఉంటుంది.
గతంలో ఉన్న స్లాబులు: 5%, 12%, 18%, 28%
కొత్త గా పైన ఉన్న స్లాబులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నిత్యవసర వస్తువులు, సాధారణ ప్రజలు కొనుగోలు చేసే వస్తువులపై భారీ తగ్గింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు GST2.0 పేరుతో కొత్త పన్ను విధానాన్ని తీసుకువచ్చింది. జీఎస్టీ 2.0 కింద కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానుంది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జీఎస్టీ స్లాబ్‌లు తగ్గి కేవలం రెండు ప్రధాన రేట్లు మాత్రమే ఉంటాయి. అదనంగా కొన్ని హానికారక,లగ్జరీ వస్తువులకు ప్రత్యేక పన్ను ఉంటుంది.
కొత్త జీఎస్టీ స్లాబ్‌లు – సెప్టెంబర్ 22, 2025 నుంచి
- 5% → అవసరమైన దినసరి వస్తువులు
- 18% → మిగిలిన చాలా వస్తువులు (గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మొదలైనవి)
- 40% ప్రత్యేక రేటు → సిగరెట్లు, పాన్ మసాలా, లగ్జరీ వస్తువులు
ఈ వస్తువులపై కొత్తగా తగ్గనున్న GST పన్ను
GST 2.0 లో తీసుకున్న నిర్ణయం మేరకు కింద ఇవ్వబడిన వస్తువులపై GST ని తగ్గించడం జరిగింది. కొన్ని ప్రముఖ వస్తువులను ఇక్కడ ఇవ్వడం జరిగింది పూర్తి పట్టిక కోసం ఈ పేజీ దిగువున చూడవచ్చు.
NIL TAX: పూర్తిగా పన్ను మినహాయింపు :
UHT పాలు, ప్యాక్ చేయబడిన పనీర్, చేన, హోమ్ మేడ్ భారతీయ రొట్టెలకు(చపాతీ, రోటి ) వంటి వాటిపై 0% GST. అంటే ఎలాంటి టాక్స్ ఉండదు.
కొన్ని ప్రాణాలు రక్షించే 33 మందుల పై కూడా 0% GST టాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.
కొత్తగా 5% GST కి తగ్గించిన వస్తువులు:
- ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు (బిస్కెట్లు, సాస్‌లు, నూడుల్స్, కాఫీ, బటర్, నెయ్యి, మొదలగునవి).
- వ్యక్తిగత సంరక్షణ వస్తువులు (హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, సబ్బులు).
- హోం యూటిలిటీ వస్తువులు (పిల్లల స్టేషనరీ వస్తువులు, బైసికిల్స్, కుట్టు మెషీన్లు).
- వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, ఇతర వ్యవసాయ రంగంలో ఉపయోగపడే వస్తువులు. (Agricularal products)
- హోటల్ ఆకమొడేషన్లు రూ.7,500 వరకు.
- జిమ్, సలూన్, యోగా, ఇతర ఆరోగ్య & బ్యూటీ సర్వీసులు.
- మెడికల్ వస్తువులు – థర్మామీటర్, డయాగ్నస్టిక్ కిట్స్ వంటి వాటిపై కూడా టాక్స్ 5% కి తగ్గింపు.
- ఇంటికి కావాల్సిన సామాన్లు (utensils)
18% GST కి తగ్గించిన వస్తువులు:
- సిమెంట్ పై జిఎస్టి 28% నుంచి 18 శాతానికి తగ్గింపు.
- ఎయిర్ కండిషనింగ్ యంత్రాలు, టీవీలు ~32 అంగుళాల వరకు, డిష్ వాషింగ్ యంత్రాలు, చిన్న కార్లు, 350 సిసికి సమానమైన లేదా అంతకంటే తక్కువ మోటార్ సైకిళ్లపై GST 28% నుండి 18%కి తగ్గింపు.
- 1200 cc వరకు పెట్రోల్ కార్లు, 1500 సిసి వరకు డీజిల్ కార్లు, త్రిచక్ర వాహనాలైన ఆటోలు, 350 cc వరకు ద్విచక్ర వాహనాలు, సరుకు రవాణాకి ఉపయోగించే వాహనాల GST 18% తగ్గింపు.
- ఆటోమొబైల్ విడిభాగాలు, బస్సులు, ట్రక్కులు అంబులెన్స్లపై జిఎస్టి 18% కి తగ్గింపు.

కొత్త మార్పుల వల్ల లాభాలు
- ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం
- పండుగల సీజన్ లో ఖర్చులు తగ్గే అవకాశం
- పన్ను వ్యవస్థ సులభతరం అవుతుంది
- వ్యాపారులకు లెక్కలు సులభం
కొత్త మార్పుల వల్ల సమస్యలు
- రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోతుందనే భయం
- లగ్జరీ వస్తువుల ధరలు ఎక్కువగానే ఉంటాయి
- సర్వీసుల రంగంలో మార్పులు ఉండవచ్చు
జీఎస్టీ స్లాబ్‌ల సమగ్ర పట్టిక
స్లాబ్ | అమలు తేదీ | ఎవరికి వర్తిస్తుంది |
---|---|---|
5% | సెప్టెంబర్ 22, 2025 | అవసరమైన వస్తువులు (సబ్బులు, సైకిళ్లు, పాలు ఉత్పత్తులు మొదలైనవి) |
18% | సెప్టెంబర్ 22, 2025 | ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, FMCG వస్తువులు |
40% (ప్రత్యేకం) | సెప్టెంబర్ 22, 2025 | సిగరెట్లు, పాన్ మసాలా, లగ్జరీ ఉత్పత్తులు |
జీఎస్టీ ఎందుకు ముఖ్యం?
- ఒకే పన్ను విధానం వల్ల పారదర్శకత పెరుగుతుంది
- వ్యాపారానికి సౌలభ్యం – అన్ని రాష్ట్రాల్లో ఒకే రూల్స్
- పన్ను ఎగవేత తగ్గుతుంది
- దేశ ఆర్థిక వ్యవస్థకు బలం

👉 మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ చూడండి: GST Council
Leave a Reply