తెలంగాణ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి వచ్చే నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
దీనిపై ఆదివారం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మరింత క్లారిటీ ఇచ్చారు.
ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో నియోజకవర్గస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లకు ఈ పథకం ద్వారా మూడు లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గృహలక్ష్మి పథకం అంటే ఏమిటి?
జాగా ఉండి ఇళ్లు లేని వారికి సొంత ఇళ్ళు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టనుంది.
ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి కుటుంబంలో మహిళ పేరిట రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల ఆర్థిక సహాయం ఇల్లు కట్టుకునేందుకు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేదవారందరికీ కూడా ఈ పథకం వర్తించనుంది.
Leave a Reply