తెలంగాణలో సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకోవాలి అనుకునే వారికి గుడ్ న్యూస్ తెలిపిన సర్కార్.
గృహలక్ష్మి పథకం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం.. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే మహిళలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు.
ఈ పథకం కింద మహిళలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇప్పటికే గృహ నిర్మాణ సంస్థ ద్వారా గతంలో తీసుకున్న రుణాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని సి ఎస్ శాంతికుమారిని ఆయన ఆదేశించారు.ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై సమీక్ష జరిపారు.
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. అదేవిధంగా ఇటీవల వర్షాలకు నష్టపోయినటువంటి పంటలకు పదివేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నష్ట పరిహారాన్ని త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అదేవిధంగా, పోడు భూముల పట్టాల పంపిణీ సంబంధించి త్వరలో తేదీ ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
Leave a Reply