Gruhalakshmi Guidelines: తెలంగాణ లో గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు విడుదల..వీరికి మాత్రమే 3 లక్షలు

Gruhalakshmi Guidelines: తెలంగాణ లో గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు విడుదల..వీరికి మాత్రమే 3 లక్షలు

తెలంగాణ లో సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి గృహ లక్ష్మి పథకం తీసుకువచ్చిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి అర్హతలను ప్రకటిస్తూ పూర్తి మార్గ దర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

గృహలక్ష్మి పథకానికి అర్హతలు మరియు మార్గ దర్శకాలు ఇవే

  • సొంత జాగా ఉండి రెండు గదులతో RCC ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం సహాయం చేయనుంది
  • మహిళ పేరు మీద ఈ సహాయం అందిస్తారు
  • ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి చొప్పున స్టేట్ రిజర్వ్ కోటా లో 43000 మందికి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తారు.
  • జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి స్థాయిలో కమిషనర్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు అవుతుంది
  • ఈ పథకానికి మహిళ పేరిట ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను ఇందుకు ఉపయోగించకూడదు
  • ఇంటి బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ లెవెల్ ఇలా మూడు దశల్లో అమౌంట్ ను అందిస్తారు
  • ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం ఇక బీసీ మైనార్టీలకు 50 శాతం కోట తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు
  • వీటికి సంబంధించి దరఖాస్తులను కలెక్టర్స్ పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ద్వారా దశలవారీగా అమౌంటును పంపిణీ చేస్తారు.

అయితే ఆహార భద్రత కార్డ్ ఉండి సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆర్సీసీ కా ఇల్లు ఇప్పటికే ఉన్నవారికి లేదా జీవో 59 కింద లబ్ధి పొందిన వారికి ఈ పథకం వర్తించదు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page