గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో కీలక మైలు రాయి పడింది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలోని పలు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలను కలిపి దేశంలోనే అతి పెద్ద నగరంగా గ్రేటర్ హైదరాబాద్ GHMC ను విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి కొత్తగా ఏ మండలాలు వస్తాయి? గ్రేటర్ హైదరాబాద్ జనాభా ఎంత పెరుగుతుంది? పూర్తి డిటేల్స్ మీకోసం.
ORR వరకు హైదరాబాద్ విస్తరణ, విలీనమయ్యే ప్రాంతాలు, మండలాలు ఇవే..
GHMC లో కొత్తగా విలీనం కానున్న నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు మరియు పురపాలక సంఘాలు ఇవే..
మేడ్చల్ జిల్లా పరిధిలో: బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట నగరపాలక సంస్థలు; దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘటకేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, దుండిగల్, కొంపల్లి, మేడ్చల్.
రంగారెడ్డి జిల్లా పరిధిలో: బడంగపేట, మీర్ పేట, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్లు; పెద్ద అంబర్పేట తుర్కయాంజాల్, ఆదిభట్ల, జలపల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ, నార్సింగి.
సంగారెడ్డి జిల్లా పరిధిలో: ఐడిఏ బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసిలో కలపడం జరుగుతుంది.

దేశంలోనే అతిపెద్ద నగరంగా జిహెచ్ఎంసి
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో ఉన్న జనాభా సుమారు 1.45 కోట్లు, విస్తరణ తర్వాత 1.70 వరకు జనాభా చేరుతుంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన లో రెండు కోట్ల వరకు జనాభా అవకాశం ఉంది.
విస్తరణ తర్వాత 5 జిల్లాలు, 47 మండలాలు, ఆరు పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతుంది.
విలీనం తర్వాత దేశంలోనే ఇప్పటికే నాలుగవ అతిపెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ ర్యాంకింగ్ లో కూడా చెన్నై, కోలకత్తా నగరాలను, వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఏరియా పరంగా అతిపెద్ద నగరంగా విస్తరించే అవకాశం ఉంది.



