రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. మొత్తం 19 క్యాటగిరిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులలో ఇప్పటికే 17 క్యాటగిరీలకు సంబంధించి పదోన్నతులు అనగా ప్రమోషన్స్ కి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసింది.
17 క్యాటగిరీల ఉద్యోగాలకు నిర్దేశించిన పదోన్నతులు ఇవే
19 కేటగిరీలలో ఇప్పటికే 17 క్యాటగిరిలో అనగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మినహా మిగిలిన అందరికీ విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతమున్నటువంటి పదవి నుంచి పదోన్నతి పొందేటటువంటి వారు కొత్తగా పొందే ఉద్యోగం పేరును ప్రభుత్వం వెల్లడించింది.
కింది పట్టికలో మీరు పదోన్నతి పొందే ఉద్యోగం వివరాలను చూడవచ్చు
ఇప్పటికే క్యాటగిరి 1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా పలువురు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల మంది సచివాలయాలలో ఉద్యోగులుగా పని చేస్తున్న విషయం తెలిసింది. మిగిలిన వారికి కూడా నిర్దేశించిన పదోన్నతుల శాఖలలో ఖాళీలు ఏర్పడగానే ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
ఇంకా విధివిధానాలు ఖరారు కానీ రెండు కేటగిరిలకు కూడా అతి త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది. ఈ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు పేర్కొంది.
Leave a Reply