రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. సచివాలయ ఉద్యోగుల ఉద్యోగుల బదిలీలకు సీఎం ఆమోదం తెలిపారు.
బదిలీలకు ఎప్పటి వరకు అవకాశం
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు జూన్ 10 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరికి జిల్లా మరియు అంతర్ జిల్లా పరిధిలో ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఎవరికైతే రెండేళ్లు సర్వీస్ పూర్తయి ప్రొఫెషన్ డిక్లరేషన్ అవుతుందో వారు ఈ బదిలీలకు అర్హులు.
ఎటువంటి బదిలీలకు అవకాశం కల్పించారు
సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల వలె సచివాలయ ఉద్యోగులకు కూడా జిల్లా పరిధిలో అదేవిధంగా అంతర్ జిల్లాల పరిధిలో కూడా బదిలీలకు అవకాశం కల్పించారు.
అంతేకాకుండా ఎవరైనా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు పరస్పర అంగీకారంతో ట్రాన్స్ఫర్ చేసుకునే మ్యూచువల్ బదిలీలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఒంటరి మహిళ లేదా వితంతువులకు కూడా బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
ఎవరైనా మెడికల్ గ్రౌండ్స్ అంటే ఆరోగ్య పరిస్థితుల కారణంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే వారికి కూడా బదిలీలలో ప్రాధాన్యత కల్పించడం జరిగింది.
అంతేకాకుండా భార్య లేదా భర్త అదే శాఖలో ఉన్నట్లయితే వారికి కూడా స్పౌస్ ట్రాన్స్ఫర్ పరిధిలో ఆప్షన్ కల్పించడం జరిగింది
ఇతర కండిషన్స్ ఏంటి
గ్రామ వార్డు సచివాలయ బదిలీలకు సంబంధించి ఏ జిల్లా పరిధిలో ఆయన 20 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయటం వీలుకాదని ప్రభుత్వం పేర్కొంది.
అయితే ఉద్యోగులు తమ సొంత గ్రామం లేదా వార్డుకి మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుపడదని ప్రభుత్వం తెలిపింది.
అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ పద్ధతిలోనే స్వీకరించడం జరుగుతుందని ప్రకటించింది. ఎవరైతే రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని ప్రొబేషన్ డిక్లేర్ అయ్యున్నారో అటువంటివారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడం జరిగింది.
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జీవో
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో కాపీని కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Leave a Reply