గ్రామాలలో ప్రజలకు మరియు పట్టణాలలో ప్రతి వార్డుకు ప్రభుత్వ సేవలను మరింత చెరువు చేసే ఉద్దేశంతో ప్రారంభించబడిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సంబంధించి ప్రతిష్టాత్మక గ్రామ వార్డు సచివాలయ 2023 బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
దీంతో గ్రామ వార్డు సచివాలయాలకు సంపూర్ణ చట్ట బద్ధత లభించినట్లు అయింది. ఇప్పటివరకు ఆర్డినెన్స్ ద్వారా ఈ వ్యవస్థను నడిపిస్తున్న ప్రభుత్వం దీనికి సంబంధించి తొలిసారి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది.
గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రస్తుతం 542 సేవలను నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. ప్రస్తుతం వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించినవే కాకుండా సర్టిఫికెట్ల జారీ, ఆధార్ మరియు ఇతర సేవలు కూడా అందించడం విశేషం.
ఇటీవల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సవరించిన జాబ్ చార్ట్ ను విడుదల చేసింది.
కింది లింక్ లో వివిధ హోదాలకు సంబంధించి సవరించిన జాబ్ చార్ట్ వివరాలను చెక్ చేయవచ్చు
Leave a Reply