రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? Online Poll

రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? Online Poll

ఇటీవల ఏలూరు సభలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసన చేపట్టడం జరిగింది.

ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? నిజంగా హ్యూమన్ ట్రాఫిక్కింగ్ జరిగిందా? అనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. దీంతోపాటు ఆన్లైన్ పోల్ కూడా ఈ పేజ్ చివర్లో నిర్వహించడం జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది మహిళలు మిస్ అయినట్లు కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు తెలియజేసినట్లు పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్, అనంతరం వాలంటీర్ వ్యవస్థ పై విమర్శలు గుప్పించారు.

మిస్ అయినవారిలో 14,000 మంది మాత్రమే తిరిగి వస్తే 18 వేల వరకు ఇంకా ఆచూకీ లభించలేదని ఆయన వ్యాఖ్యానించారు. వైసిపి తరఫున వాలంటీర్ స్కీంను ప్రారంభించారని, ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటారు, ఆడపిల్లల వివరాలు, ఒంటరి, వితంతువులు ఎంత మంది వంటి వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారని, వీరి డేటా వలన హుమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఆరోపించారు.

ఒంటరిమహిళల డేటాని సేకరించి వీరు సంఘవిద్రోహసశక్తులకిస్తే వారు వీరిని కిడ్నాప్ చేస్తున్నారు, ఇందులో వైసిపి పెద్దల హస్తం కూడా ఉన్నట్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

సోమవారం సాయంత్రం వాలంటీర్లపై మరో ప్రకటన

సోమవారం సాయంత్రం వాలంటీర్ల నుంచి వచ్చిన నిరసనపై పవన్ కళ్యాణ్ మరోసారి కామెంట్స్ చేయడం జరిగింది.

ప్రతిభవంతులని కేవలం 5000 రూపాయలు ఇచ్చి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని, వాలంటర్ల పొట్ట కొట్టడం తన ఉద్దేశం కాదని అన్నారు. అయితే వాలంటీర్ల నుంచి కీలక సమాచారం మాత్రం బయటకు వెళ్తుందని వ్యాఖ్యానించారు.

5000 కి ఊడిగం చేసే ఉద్యోగం వాలంటీర్ పోస్ట్ అని, వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ ఉన్నప్పుడు మరి వాలంటీర్లు ఎందుకని? వారికి కీలక సమాచారం ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు పార్టీ బలోపేతానికని భావించామని అయితే ఇప్పుడు భయంకర వ్యవస్థగా మారుతుందని మరోసారి వ్యాఖ్యానించారు.

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల నిరసనలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు భారీ ర్యాలీలు మరియు నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.

పశ్చిమగోదావరి భీమవరం, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, విజయనగరం విశాఖపట్నం జిల్లాలో భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

పల్నాడు గుంటూరు బాపట్ల మరియు ఇతర జిల్లాలలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

అటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో, కడప, చిత్తూరు, తిరుపతి అనంతపూర్ జిల్లాలలో కూడా భారీగా నిరసన ర్యాలీలను మరియు కార్యక్రమాలను వాలంటీర్లు చేపట్టడం జరిగింది.

Volunteers conducting rally against pk

వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? ఎంత నిజముంది?

గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ అనేది ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చెరువ చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండున్నర లక్షల మంది గ్రామ వాలంటీర్లకు సంబంధించి నియామకాలు జరిపేటప్పుడు కొంతమేర వైసిపి సానుభూతిపరులకు ఈ పోస్టులు కేటాయించారు అనే అభిప్రాయం చాలా మంది పార్టీలలో మరియు ప్రజల్లో నెలకొంది. అంతమాత్రాన వాలంటీర్లపై ఇంత భారీ గా విమర్శలు మోపడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అయితే అంతమాత్రాన హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని అనడం ఎంత వరకు సమంజసం?

ఒకవేళ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగినా అది వాలంటీర్లు చేస్తున్నారు అని అనడం కరెక్ట్ కాదు. అయితే రెండో సారి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పుడు కీలక సమాచారం వాలంటీర్ల నుంచి లీక్ అవుతుందని పేర్కొన్నారు. ఇదే మాట మొదటి సభలో చెప్పి ఊరుకుంటే ఇంత రచ్చ అయ్యేది కాదు. పూర్తి మహిళల అక్రమ రవాణా మొత్తం వాలంటీర్ల కనుసన్నల్లో మరియు వారి డేటా ఇతరులకు చేరవేయడంతో జరుగుతుంది అని ఏలూరు సభలో వ్యాఖ్యానించడం నిజంగానే తప్పు. వాలంటీర్ల లో కొంతమంది వైసిపి సానుభూతిపరులు ఉండి ఉండవచ్చు, అంతమాత్రాన పూర్తి వ్యవస్థను విమర్శించడం ఎంతవరకు సమంజసం? అది కూడా అక్రమ రవాణాకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది? ప్రజలకు సంబంధించి లేదా వివిధ పథకాలకు సంబంధించి కీలక సమాచారం వారి వద్ద ఉండి ఉండవచ్చు దీనికి సంబంధించి హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్రమ రవాణాలో వాలంటీర్ల పాత్ర ఉందని చెప్పడం మాత్రం వాలంటీర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా భారీగా నిరసనలు చేపట్టడం జరిగింది.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ తెలియజేయండి

[TS_Poll id=”14″]

[TS_Poll id=”15″]

Click here to Share

6 responses to “రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? Online Poll”

  1. జోగ. ఎర్ని హరీష్ యేదావ్ Avatar
    జోగ. ఎర్ని హరీష్ యేదావ్

    అయన మతిపోయి వున్నాడు వీడికి మహిళా భద్రత కావాలా
    దెయ్యాలు వేదాలు వాళ్ళించినట్టు వుంది

  2. Raju Avatar
    Raju

    మిస్సింగ్ కేసులు వాలంటీర్స్ వల్లనే ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా , మరి వేరే రాష్ట్రాల్లో వాలంటీర్స్ లేరు కదా , మరి అక్కడ ఎందుకు కేసెస్ ఎక్కువగా ఉన్నాయి… కష్టపడి పనిచేస్తున్న వాలంటీర్స్ నీ పోగడక పోయినా పర్లేదు, కానీ విమర్శలు చెయ్యకూడదు plz

  3. Bajari Avatar
    Bajari

    Pawan kalyan sir says correct but andharu kaadhu konthamandhi nijangaane chesthunnaru inkoka vishayam emante volunteers andharu YCP party ki chendhinavaare verokariki volunteer job ivvaledhu

  4. M Nanibabu Avatar
    M Nanibabu

    హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది (బైబిల్) పవన్ కళ్యాణ్ గారికి ఆడవాళ్ల గురించి ఎప్పుడూ తప్పుడు ఆలోచనే ఉంటుంది అది ఆయన నేచర్ ఆయన లీడర్ కి unfit అన్ని మూసుకొని సినిమా డైలాగులు చెప్పుకో మనండి volunteers జోలికి వస్తే ఉరుకోము the only one young and dynamic leader that is జగన్ మోహన్ రెడ్డి గారు జై జగన్ జై YSR

  5. Mamidi Nagendra Babu Avatar
    Mamidi Nagendra Babu

    పచ్చ కామెర్ల వాడికి లోకం పచ్చగా కనిపిస్తుంది అని , అందరూ వాడిలాగే చిత్తకార్తి కుక్కలు అనుకుంటున్నాడు.

    చంద్ర నాయుడు + లోకేశం ఇద్దరు ఒకేసారి దత్తుడిలో పూని నోటికి వచ్చినవి అన్ని వాగిస్తున్నారు.

  6. Yadla Gouri naidu Avatar
    Yadla Gouri naidu

    ప్యాకేజీ స్టార్ వాడక వెధవ

You cannot copy content of this page