Government of Andhra Pradesh is catering seva awards to all the village and ward volunteers across the state in recognition to their work and service.
Hereby govt has announced 3 categories of these awards across all secretariat in the state.
ప్రభుత్వం క్రింది మూడు విభాగాలు గా ఈ అవార్డ్స్ ని అందిస్తుంది.
- Seva Mitra – సేవా మిత్ర
- Seva Ratna – సేవా రత్న
- Seva Vajra – సేవా వజ్ర
ఈ అవార్డ్స్ వచ్చిన వారికి ఏమి ఇస్తారు?
s.no | Award Category | Prize | Certificate | Shawl | Badge | Medal |
1 | Seva Mitra | 10000 + Certificate+ Shawl + Badge | Y | Y | Y | N |
2 | Seva Ratna | 20000 + Certificate+ Shawl + Badge + Medal | Y | Y | Y | Y |
3 | Seva Vajra | 30000 + Certificate+ Shawl + Badge + Medal | Y | Y | Y | Y |
ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది?
ప్రజలకు SMS రూపంలో మెసేజ్ పంపించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సచివాలయం లో పని తీరు, దిగువ ఇవ్వబడిన అంశాల ఆధారంగా ఈ సెలక్షన్ చేపట్టడం జరుగుతుంది.
- బయోమెట్రిక్ హాజరు – 35 పాయింట్లు
- పెన్షన్ పంపిణి – 35 పాయింట్లు
- ఫీవర్ సర్వే – 30 పాయింట్లు
Note: ఎటువంటి కంప్లైంట్స్ ఉండకూడదు. 2022 మార్చి 31 నాటికీ 1 సంవత్సరం పూర్తి సర్వీస్ కలిగి ఉండాలి.
1 . బయోమెట్రిక్ హాజరు : 35 పాయింట్లు
పరిగణలోకి తీసుకోబడిన నెలల్లో ప్రతి నెల 4 సార్లు అయిన హాజరు వేసి ఉండాలి. ఆయా నెలలో 4 సార్లు హాజరు వేసి ఉంటే ఆ నెల మొత్తం 100% హాజరు పరిగనిస్తారు. ఆ విధం గా నెలకు కనీసం 4 సార్లు హాజరు వేసిన నెలలు ‘ N ‘ అనుకుంటే హాజరుకు సంబందించిన మార్కులు = N×(35/12)
Example: 6 నెలలు పరిగణిస్తే 6*(35/12) = 17.5
2. పెన్షన్ పంపిణి – 35 పాయింట్లు :-
ప్రతి నెల మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు పెన్షన్ పంపిణీ మరియు మొదటిరోజు 100% పెన్షన్ పంపిణీ పూర్తి చేసారా లేదా పరిగణలోకి తీసుకుంటారు.
పెన్షన్ పంపిణీకి సంబంధించి మార్కులను ఇచ్చే విధానం
A. 25 కన్నా తక్కువ పెన్షనర్లు ఉంటే :
వాలంటీరు 100% పెన్షన్లను మొదటిరోజు పంపిణీ చేసినట్లయితే పూర్తి మార్కులు ఇవ్వడం జరుగును అంటే 35 మార్కులు ఇస్తారు లేని పక్షాన 15 మార్కులు ఇస్తారు.
B. వాలంటీర్ కు 25 లేదా 25 కన్నా ఎక్కువ పెన్షనర్లు ఉన్నట్టయితే :
[ [ మొదటి రోజు పెన్షన్ పంపిణీ × 35 ] + [ 2వ, 3వ 4వ 5వ రోజు పెన్షన్ పంపిణీ × 25 ] ] / మొత్తం పెన్షన్దారులు
Example:
Volunteer A – 10 pensioners = distributed on1st day – 100% = Marks : 35
Volunteer B – 30 pensioners – 1st day : 10 , 2nd day : 10 , 3rd day : 10 = Total marks : (10×35)+((10+10)x25)) / 30 = 31.6666666667
C. ఫీవర్ సర్వే: 30 పాయింట్లు
డిసెంబర్ 2021 & జనవరి 2022 నెలల్లో 100% ఇళ్లకు ఫీవర్ సర్వ్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఫీవర్ సర్వే లో ఎన్ని ఇళ్లను కవర్ చేస్తారో ఆ శాతం (N%) = [ మొత్తం కవర్ చేసిన హౌస్ హోల్డ్ సంఖ్య ] / [మొత్తం హౌస్ హోల్డ్ సంఖ్య ] ×100
మార్కులు = N% × 30
Example:
డిసెంబర్ 2021, జనవరి 2022 సర్వే లలో
మొత్తం హౌస్ హోల్డ్ లు – 50
సర్వ్ చేసినవి – 30
సర్వే % = [ 30/50 ] ×100
= 60%
మార్కులు = 60/100×30 = 18
Awards Schedule : అవార్డ్స్ ఎప్పటినుంచి ఇస్తారు?
07.04.2022
ఉగాది రోజున ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత , నెల పాటు ప్రతి జిల్లా లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది .
ప్రతి రోజు రెండు సచివాలయల చప్పున ఈ కార్యక్రమం కొనసాగుతుంది
Leave a Reply