ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ముఖ్య గమనిక. ప్రభుత్వం రైతులకు విశిష్ట గుర్తింపు సంకేచారి చేస్తుంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ మొదలైంది రైతన్నల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు. నకిలీ రైతులు బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు ఈ నేపథ్యంలోని ఈ అక్రమంగాలకు అట్టు కట్టు వేసేందుకు కేంద్రం ఈ విశిష్ట సంఖ్య జారీ చేస్తుంది. అరులైన రైతులకు లబ్ధి చేకూర్చేలా ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ప్రతి రైతుకు నిర్దిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అన్నదాత వివరాలు నమోదు ప్రక్రియ మొదలైంది.
రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ విశిష్ట సంఖ్య జారీ చేస్తున్నారు. భూమి ఉన్న ప్రతి రైతు అర్హుడే. ఈ నెంబర్ పొందడానికి రైతులు తమ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబరు పట్టాదారు పాసుపుస్తకం తీసుకొని రైతు సేవ కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ సిబ్బందిని సంప్రదించాలి. సిబ్బంది రైతు వివరాలను నమోదు చేసి విశిష్ట సంఖ్యను జారీ చేస్తారు. నమోదు ప్రక్రియ పూర్తి కాగానే రైతుల మొబైల్ కు ఓటిపి వస్తుంది ఈ ఓటిపిని రైతు సేవ కేంద్రం సిబ్బందికి తెలియజేస్తే నమోదు ప్రక్రియ పూర్తి రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు
Leave a Reply