దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఆసరా పెన్షన్ 4016 కు పెంపు

దివ్యాంగులకు గుడ్ న్యూస్, ఆసరా పెన్షన్ 4016 కు పెంపు

తెలంగాణలో దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ పై వెయ్యి రూపాయల మేర పెంచి 4016 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

జూలై నుంచి పెంచిన పెన్షన్ ₹4016 అమలు

దివ్యాంగులకు ₹3016 రూపాయల నుంచి ₹4016 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అమౌంట్ ను పెంచడం జరిగింది. ఈ పెంచిన పెన్షన్ అమౌంటును జూలై నుంచే లబ్ధిదారులకు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్ అర్హత ఏంటి

  • ఎటువంటి వయోపరిమితి లేదు
  • కనీసం 40% అంగవైకల్యం ( disability)  SADAREM కింద ధ్రువీకరించబడి ఉండాలి
  • చెవిటి వారి కైతే కనీసం 51% వైకల్యం ఉండాలి.

Documents required – ఏ డాక్యుమెంట్స్ కావాలి?

  • దివ్యాంగులకు సరైన SADAREM సర్టిఫికేట్ ఉండాలి.
  • ఫోటో
  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి

దువ్యాంగులు పెన్షన్ కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

  • మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్ నుంచి కానీ లేదా మీసేవ నుంచి గాని అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ లేదా స్వయంగా తీసుకొని అప్లికేషన్ ను నింపాల్సి ఉంటుంది.
  • నింపిన అప్లికేషన్ తో మీ సదరం సర్టిఫికెట్ మరియు పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీ గ్రామ పంచాయతీ సెక్రెటరీ కి అందించవచ్చు.

You cannot copy content of this page