ఏపీలోని అతిపెద్ద నగరమైన వైజాగ్ కి మరో కీలక ప్రాజెక్టు తరలి వచ్చింది.. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారికంగా ధ్రువీకరించడం జరిగింది. (Google opens Asia’s biggest data centre in Vizag)
ఆరు బిలియన్ డాలర్లు అంటే సుమారు 52,559 కోట్లతో భారీ ప్రాజెక్టును గూగుల్ నిర్మించనుంది.
వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ప్రత్యేకతలు ఇవే [Key facts about Google Data Centre in Vizag]
- వైజాగ్ లో నిర్మిస్తున్న డేటా సెంటర్ ఆసియాలోనే అతి పెద్దది, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డేటా సెంటర్.
- యూఎస్ బయట గూగుల్ నిర్మిస్తున్న అతి పెద్ద డేటా సెంటర్ ఇదే
- ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ సుమారు 52,559 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది.
- వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ కి మూడు సముద్ర ల్యాండింగ్ స్టేషన్లు ఉంటాయి.
- ముంబైలో ఉన్న డేటా సెంటర్ కి రెండు రెట్లు సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మాణం జరగనుంది.
- వైజాగ్ లో నిర్మించే డేటా సెంటర్ గూగుల్ సొంతంగా నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్
- ఒక గిగా వాట్ సామర్ధ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.
- అత్యంత వేగంగా డేటా ప్రాసెస్ చేయడానికి మరియు క్లౌడ్ సర్వీసులు అందించడానికి ఈ డేటా సెంటర్ కీలకంగా మారనుంది.
- గ్రీన్ ఎనర్జీ రంగంలో నే గూగుల్ 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.
- విశాఖ మధురవాడ లో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ డేటా సెంటర్ కి సంబంధించి అధికారులు మరియు మంత్రులు కూడా వివిధ సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి అధికారిక ధృవీకరణ పూర్తయింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో కీలక ముందడుగు పడనుంది. కస్టమర్లకు అత్యంత త్వరితగతిన సేవలు మరింత వేగవంతం చేసే దిశగా ఈ డేటా సెంటర్ పనిచేయనుంది.

Address of Vizag Google Data Centre: Madurawada, Vizag, Andhra Pradesh, India.
Leave a Reply