రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉచిత ఇసుక అని చెబుతున్నప్పటికీ ఇప్పటికే కొన్ని రుసుములు వసూలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదే విషయంపై రాష్ట్రంలో ప్రజలు కొంతమేర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చార్జీలను మరింత తగ్గిస్తూ నామమాత్రపు చార్జీలతో ఉచిత ఇసుక విధానాన్ని రూపొందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇసుకపై ఇకపై సీనరేజ్ చార్జీలు రద్దు
ప్రస్తుతం టన్నుకి 88 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నటువంటి సీనరేజ్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై కేవలం ఇసుక తవ్వినందుకు మాత్రమే చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఇసుక తవ్వకాల కు సంబంధించి కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్ల కి అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా జీఎస్టీ భారం 18 శాతం నుంచి ఐదు శాతం వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది.
ఇక ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మరింత వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఎవరైనా సరే ఎడ్ల బండిలో లేదా ట్రాక్టర్ లో సొంతంగా ఇసుక రీచ్ లో నుంచి ఇసుకను తరలించుకునే అవకాశం కల్పించడం జరిగింది.
సీనారేజ్ మరియు ఇతర చార్జీలు కలిపి ప్రస్తుతం టన్నుకు 88 రూపాయలు వసూలు చేస్తుండగా, ఇకపై ఈ భారం పూర్తిగా తొలగిపోనుంది. ఉదాహరణకు ఎవరైనా పది టన్నుల ఇసుక తీసుకుంటే 880 కింద చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఈ నిర్ణయం పై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. బుధవారం ఎందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. ఈ నిర్ణయం పూర్తి గా అమలు అయితే నామమాత్రపు చార్జీలతో ఉచిత ఇసుక విధానానికి నాంది పలికినట్లు అవుతుంది.
Leave a Reply