AP Free Gas Cylinder Scheme FAQ: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, సూపర్ సిక్స్ పథకంలో భాగమైనటువంటి ఈ పథకానికి సంబంధించి సందేహాలు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అంటే ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలకు వంటగ్యాస్ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఈ పథకం ద్వారా అందిస్తుంది. దీపం పథకం పేరుతో దీనిని అమలు చేస్తుంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హత ఏమిటి?
రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. వీటితోపాటు సరైన ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతా ఉండాలి.
గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీదైనా ఉండవచ్చా?
అవును.
ఏ గ్యాస్ కనెక్షన్ల కు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వర్తిస్తుంది?
కేవలం మూడు ప్రధాన ఏజెన్సీలైనటువంటి ఇండెన్ భారత్ గ్యాస్ మరియు హెచ్ పి కనెక్షన్ల కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఎస్ఎంఎస్ వస్తుందా?
అవును. ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ అయినట్లు ఎస్ఎంఎస్ వస్తుంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ ను ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు?
ఉచిత గ్యాస్ సిలిండర్(free gas cylinder) ను బుక్ చేసుకున్న 48 గంటల్లో డెలివరీ చేస్తారు. పల్లెల్లో అయితే 48 గంటలు పట్టణాల్లో అయితే 24 గంటల్లోనే డెలివరీ చేసే అవకాశం ఉంటుంది.
డెలివరీ సమయంలో అమౌంట్ పే చేయాలా?
అవును చేయాలి. మీరు చెల్లించిన పూర్తి అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
అమౌంట్ మీ ఖాతాలో జమ అయిన వెంటనే మీకు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. లేదా మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
ఎప్పటినుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు?
29 అక్టోబర్ ఉదయం పది గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. తొలి సిలిండర్ అక్టోబర్ 29 నుంచి మార్చి 31 లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి నాలుగు నెలల్లో ఒకసారి మీరు బుక్ చేసుకోవచ్చు. సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు.
మాకు అర్హత ఉన్నప్పటికీ ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ అవ్వలేదు. ఏం చేయాలి?
అర్హత ఉన్నప్పటికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ అవ్వకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ప్రైవేటు ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ ఉంది ఏం చేయాలి?
ప్రస్తుతానికి పైన పేర్కొన్న మూడు ఏజెన్సీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. HP, Indane మరియు Bharatgas. తెల్ల రేషన్ కార్డు ఉన్నచో ఈ మూడు గ్యాస్ కనెక్షన్లలో ఏదో ఒకటి తీసుకొని ఉచితంగా సిలిండర్ పొందవచ్చు.
మాకు తెల్ల రేషన్ కార్డు ఉంది కానీ గ్యాస్ కనెక్షన్ లేదు.
అటువంటివారు కొత్తగా గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్యాస్ డెలివరీ సమయంలో అదనంగా డెలివరీ చార్జీలు చెల్లిస్తున్నాం. వాటిని కూడా ప్రభుత్వం ఇస్తుందా?
లేదు. ప్రభుత్వం కేవలం గ్యాస్ సిలిండర్ ధర ఏదైతే ప్రస్తుతం 821 నుంచి 851 వరకు వసూలు చేస్తున్నారు ఆ అమౌంట్ ను మాత్రమే రీఫండ్ ఇస్తుంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
Leave a Reply