ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్ బుకింగ్ పథకాన్ని ప్రభుత్వం దీపావళి నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఈ పథకాన్ని గతంలో అమలు చేసిన దీపం పథకానికి అనుసంధానించి అర్హులైన వారికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు.
అయితే ఈ పథకానికి సంబంధించి గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం నేడు అనగా అక్టోబర్ 29 ఉదయం 10 గంటల తర్వాత నుంచి బుక్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కలిగించింది.
నేటి నుంచి 31 వరకు బుక్ చేసుకున్న వారికి దీపావళి రోజు పథకం ప్రారంభించిన తర్వాత అందరికీ సిలిండర్లు డెలివరీ చేయడం జరుగుతుంది. సిలిండర్ అందిన 48 గంటల్లో సిలిండర్ కి సంబంధించిన అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
ఈ పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మాత్రమే సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కలదు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కింది లింకులో కలవు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి తరచుగా వచ్చే సందేహాలు మరియు స్థానిక సంబంధించిన సమాధానాలు కింది లింకులు అప్డేట్ చేయడం జరిగింది.
Leave a Reply