ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగానికి చేయుత అందించడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందు చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల మగ్గాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలనే పథకాన్ని ఆయన ఆమోదించారు.
ఆగస్టు 1 నుండి అమల్లోకి
నేటి నుంచే అంటే ఆగస్టు 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.

రూ.125 కోట్ల వ్యయం – వేలాది మందికి లబ్ధి
ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మగ్గాలు, 15 వేల మర మగ్గాలు కలిగిన కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
ఈ పథకం అమలుకు ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ పథకం చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా ఒక మంచి అడుగుగా భావించవచ్చు. విద్యుత్ ఖర్చుల భారం తగ్గడం వల్ల నేతన్నల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
Leave a Reply