ఏపీ లో చేనేత కార్మికుల కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు కురిపించారు. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన చేనేత వర్గాల పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నేతన్నలకు ఆగస్ట్ 7 నుంచి అమలు కానున్న బెనిఫిట్స్ ఇవే..
రాష్ట్రవ్యాప్తంగా చేనేత పనులు చేసుకుంటూ జీవనాధారం సాధిస్తున్న నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కింద ఇవ్వబడిన ప్రయోజనాలను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 7 అనగా జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని వారికి ఈ బెనిఫిట్స్ ని అందిస్తారు. ఏమేం ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.
- చేనేత వస్త్రాలపై జిఎస్టి మినహాయిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వారి వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వం భరిస్తుందని పేర్కొంది.
- చేనేత కార్మికులకు విద్యుత్ ఫ్రీ.. ఆగస్టు 7 నుంచి చేనేత మగ్గాలపై 200 యూనిట్ల వరకు ఫ్రీ, మర మగ్గాలపై 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
- కార్మికుల కోసం ఐదు కోట్ల రూపాయలతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఫండ్ ద్వారా అవసరమైనప్పుడు కార్మికులకు తక్కువ వడ్డీ మీద రుణ సౌకర్యం లభించే అవకాశం ఉంటుంది.

చేనేత కార్మికులు మరియు జోలి శాఖపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. వ్యవసాయ శాఖ తర్వాత అత్యధిక కీలకమైనటువంటి రంగం చేనేత రంగం అని, వారిని ఆదుకోవాలని ఉద్దేశంతోనే ఈ ప్రయోజనాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7 గురువారం నుంచి చేనేత కార్మికులకు పైన పేర్కొన్న ప్రయోజనాలు వర్తిస్తాయి.

Leave a Reply