ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య

,

విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు మరియు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లలో ప్రవేశాల కోసం ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు, దివ్యాంగులు, అనాధలకు ప్రాధాన్యం.. లాటరీ పద్ధతిలో ఎంపిక 

2023 విద్యా సంవత్సరానికి గాను ఏపీ RTE సెక్షన్ 12.1.C కింద ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 22 మార్చి 2023 నుండి 10 ఏప్రిల్ 2023 వరకు అడ్మిషన్స్ జరుగును.

5 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశం

ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం 2010

ఆంధ్రప్రదేశ్ విద్య హక్కు చట్టంలోని 2010 సెక్షన్ 12 (1) (సి) ప్రకారం 25 శాతం సీట్లు సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కొరకు ప్రైవేట్ ఆన్డేడ్ స్కూళ్లలో రిజర్వ్ చేయబడ్డాయి

నిబంధనలు

విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1.20 లక్షలు, పట్టణాల్లో 1.40 లక్షలు

అనాధ, హెచ్ఐవి బాధిత పిల్లలు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, బిసి, మైనారిటీ, ఓసీలకు 6% సీట్లు కేటాయింపు

ఎవరు అర్హులు

  • సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలు
  • బిపిఎల్ / ప్రభుత్వం యొక్క పేదరిక నిర్మూలన కార్యక్రమాల యొక్క లబ్ధిదారులు
  • భూమి లేని వ్యవసాయ కూలీలు
  • దివ్యాంగులు
  • షెడ్యూల్డ్ కులం మరియు తెగలు

ఇలా దరఖాస్తు చేసుకోండి..

  • ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటా ప్రవేశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లోని పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
  • ఇంటినుంచి కిలోమీటరు దూరంలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు మొదట ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలోని వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
  • అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, ఏడాదికి గ్రామాల్లో రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆర్థిక బలహీనవర్గాలకు 6% సీట్లను కేటాయిస్తారు. ఆయా రిజర్వేషన్లలో విద్యార్థులు లేకపోతే వాటిని ఇతరులకు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో మొదట ఎస్టీ పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు.
  • సీట్లు కేటాయించిన వారం రోజుల్లో పిల్లలు పాఠశాలలో చేరిందీ లేనిదీ యాజమాన్యం నిర్ధారించకపోతే దాన్ని వివాదాస్పద సీటుగా పరిగణిస్తారు. దీన్ని జిల్లా ప్రవేశాల పర్యవేక్షణ కమిటీకి సిఫార్సుచేస్తారు. జిల్లా కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించొచ్చు. పాఠశాలకు వ్యతిరేకంగా ఏదైనా వివాదాన్ని జిల్లా కమిటీ గుర్తిస్తే సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఉంటుంది.

విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయించి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేయడం జరుగుతుంది

అవసరమైన డాక్యుమెంట్స్ లేదా గ్రీవియన్స్ సమాచారం కొరకు సమీప మండల విద్యాశాఖ కార్యాలయం లేదా వార్డు సచివాలయం గ్రామ సచివాలయం లేదా సమీప ప్రైవేటు పాఠాశాలలను సంప్రదించండి

ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 14417

ఇండస్ యాక్షన్ హెల్ప్ లైన్ నెంబర్ 9502666864

Note: టోల్ ఫ్రీ కాల్స్ కొరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోమవారం నుండి శనివారం వరకు సంప్రదించవచ్చు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page