దివ్యాంగుల దినోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన 7 వరాలు – పూర్తి వివరాలు
దివ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులపై వరాలు కురిపించారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్లస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు కింద ఇవ్వబడిన విధంగా మరికొన్ని కీలక ప్రకటనలు చేశారు.
దివ్యాంగుల కోసం సీఎం చంద్రబాబు ప్రకటించిన 7 వరాలు (Indradhanussu)
- RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం – రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందించనున్నారు.
- ప్రాంతీయ సంస్థల్లో దివ్యాంగ ప్రతినిధుల నామినేషన్ – స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు మరియు పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు.
- ఎవరు గెలవకపోయినా ఎక్స్‌అఫీషియో మెంబర్ పదవి – ఎన్నికల్లో గెలవకపోయినా దివ్యాంగులకు ఎక్స్‌అఫీషియో మెంబర్ పదవిని కేటాయించనున్నారు.
- దివ్యాంగులకు ఆర్థిక రాయితీ రుణ పథకం పునరుద్ధరణ – 19 కోట్ల వ్యయంతో ప్రత్యేక రుణ పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నారు.
- SHAP ద్వారా క్రీడా & టాలెంట్ డెవలప్‌మెంట్ – అన్ని క్రీడా కార్యక్రమాలు, ప్రతిభాభివృద్ధి పథకాలు SHAP ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.
- బహుళ అంతస్తుల ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు – ప్రభుత్వ గృహ నిర్మాణాల్లో దివ్యాంగులకు ప్రత్యేకంగా గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు కేటాయించనున్నారు.
- వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాల – బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సీఎం ప్రకటించారు.
దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం
ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం తాజాగా దివ్యంగులను కూడా ఈ కేటగిరీలో చేర్చనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మరింత ఊరట చేకూరనుంది.
కార్పొరేట్, ప్రైవేట్ రంగాల సహకరంతో ఉద్యోగావకాశాలు
కార్పొరేట్ కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ఇంటర్‌ప్రైజ్ విభాగాలతో కలిసి దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దివ్యాంగుల ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్ధి శిక్షణలు అందించనున్నట్లు సీఎం తెలిపారు.
క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహం
SAAP ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు, ఆర్థిక సబ్సిడీ, ప్రత్యేక డిగ్రీ కాలేజీలు, వారు ఉన్నచోటే పెన్షన్ పంపిణీ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
‘దివ్యాంగ్ భవన్’ నిర్మాణం
రాజధాని అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘దివ్యాంగ్ భవన్’ నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది దివ్యాంగుల కోసం శిక్షణ, సేవలు, ఉద్యోగ అవకాశాల సమన్వయం వంటి అన్ని కార్యక్రమాలకు కేంద్రంగా ఉండనుంది.
మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ సంకల్పం
దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక విధానాలు రూపొందించి అమలు చేస్తామని, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Also Read
- దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు (Free Three Wheeler Bikes)
- AP Disabled Students NSP Scholarship 2025 : ఏపీలో స్కూల్, కాలేజీ విద్యార్థులకు శుభవార్త… రూ.10వేల నుంచి రూ.14,600 వరకు ఉపకార వేతనాలు
విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంధ మహిళా టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు సభ్యులు దీపిక, కరుణకుమారిని సన్మానించారు.
దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు
గురుకుల పాఠశాలలు, కళాశాలలు మరియు వసతిగృహాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో దివ్యాంగులకు అందించిన సాయం
- వీరంకి శిరీషకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనం
- మనోజ్‌కు ల్యాప్‌టాప్
- గ్లోరీకు టచ్ ఫోన్
విశాఖలో దివ్యాంగుల క్రీడా స్టేడియం
విశాఖపట్నంలో 23 ఎకరాల్లో National Center for Disability Sports Stadium నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది:
- 1,800 రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు
- 14,000 ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు & వీల్‌ఛైర్లు
- 2260 స్పెషల్ టీచర్ పోస్టులు మెగా DSC ద్వారా భర్తీ
దివ్యాంగ పింఛన్లపై ప్రభుత్వం ఖర్చు
దేశంలో అత్యధికంగా రూ.6,000 పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం తెలిపారు. ప్రతి సంవత్సరం:
- 7.68 లక్షల దివ్యాంగులకు పింఛన్ల పంపిణీ
- మొత్తం వ్యయం – రూ.6,000 కోట్లు
ఎన్టీఆర్ మొదటిసారి దివ్యాంగులకు పింఛన్లు ప్రారంభించారని, తాను రూ.200 నుండి రూ.6,000 వరకు పెంచానని సీఎం వివరించారు.



