స్త్రీ శక్తి పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సులను నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
త్వరలో ఉచిత బస్ పథకంలో భాగమైన అన్ని బస్సులకు లైవ్ ట్రాకింగ్(free bus travel live tracking)అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో ఆర్టీసీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఉచిత బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టాలని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ లో మహిళా చైతన్యం ఎక్కువగా ఉంటుందని, ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందడంలో మహిళలు ముందుంటారని ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల సర్వీసులలో ఉచిత బస్సు ప్రయాణాన్ని స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply