ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉగాది పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు మరియు రవాణా శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి ఆయన కీలక చర్చలు జరిపారు. రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
మొత్తానికి ఉగాది నాటికి ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. అంటే మార్చి 30 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించే దిశగా కూడా చర్చలు జరిగాయి.
Free Bus Travel Andhra Pradesh Launch date: 30.03.2025
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అర్హతలు
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మరియు బాలికలు అందరికీ వర్తిస్తుంది. వీరితో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
ఉచిత బస్సు ప్రయాణం ఏ బస్సులలో పొందవచ్చు
ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Travel Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్డినరీ, ఆర్డినరీ ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ మరియు సిటీ మెట్రో బస్సులలో కల్పించడం జరుగుతుంది.
అయితే ఏసీ స్లీపర్ మరియు సూపర్ లగ్జరీ బస్సులలో ఈ ఉచిత బస్సు ప్రయాణం వర్తించదు.
Leave a Reply