Free Bus Scheme: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల తెలిపింది. అది కూడా జిల్లాలో పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయడంపై కొంత నిరాశ వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం మరో ప్రకటన చేసింది.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండబోతున్నట్టు రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తెలిపారు. ఈ ఉచిత బస్సు ప్రయోజనం కేవలం ఆయా జిల్లాల మహిళలకు తమ జిల్లాలోనే వర్తిస్తుందని సీఎం ఇటీవల స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీలో ఉచిత బస్ ప్రయాణాన్ని కేవలం పల్లె వెలుగు మరియు అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో మాత్రమే అమలు చేస్తామని తొలుత మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించగా ఆ తర్వాత ఆర్టీసీ ఎండి తిరుమలరావు మరో కీలక ప్రకటన చేశారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో సైతం ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఎలాగో ఈ పథకాన్ని జిల్లాలకే పరిమితం చేసిన నేపథ్యంలో కనీసం వీటిని ఎక్స్ప్రెస్ బస్సుల లో సైతం అమలు చేస్తే బాగుంటుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక ఆగస్టు 15నే మరో కొత్త పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం వలన ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారికి పదివేల రూపాయలు అందించే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది.
Join us on WhatsApp for more updates
Leave a Reply