ఉద్యోగుల శాలరీ నుంచి ప్రతి నెల కట్ అయ్యే ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ భవిష్యనిధి (ఈపీఎఫ్) డిపాజిట్ల పై చెల్లించే
వడ్డీ రేటును 8.15 శాతంగా ఖరారు చేసినట్లు సమాచారం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) గానూ ఈ
వడ్డీరేటును చెల్లించాలని మార్చ్ 27 న సమావేశమైన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ (CBT) ఈ మేరకు నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఉన్న 8.1% వడ్డీరేటునే యథాతథంగా కొనసాగించనున్నట్లు వార్తలు వెలువడినప్పటికి ఇందులో 0.05% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఈ నిర్ణయాన్ని సీబీటీ ముందుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించడం జరుగుతుంది. దీనిపై కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆర్థిక సంవత్సరం లో లెక్కించబడిన మొత్తం వడ్డీ ని ఆర్థిక సంవత్సరం చివర్లో ఉద్యోగుల PF ఖాతా కి జమ చేస్తారు.
EPFO కి సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్ కొరకు కింది అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
Leave a Reply