Emergency Alert : చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈరోజు తమ ఫోన్ లో అత్యవసర హెచ్చరికతో (Emergency Alert) కింది మెసేజ్ ను అందుకున్నారు. బిగ్గరగా బీప్ సౌండ్ తో సందేశాన్ని తమ స్క్రీన్ పైన పొందడం జరిగింది.

ఇది అసలు ఏంటో, ఎందుకు వచ్చిందో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకే అని నొక్కితే ఏమవుతుంది అని కూడా ఆలోచించడం జరిగింది.
కంగారు పడాల్సిన అవసరం లేదు
అయితే దీని గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితులు , ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అలెర్ట్ చేసేందుకు ప్రభుత్వం ఈ అలర్ట్ (హెచ్చరిక) సర్వీసు ను టెస్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా టెస్ట్ ఫ్లాష్‌ను పంపడం ద్వారా అత్యవసర హెచ్చరిక వ్యవస్థను పరీక్షించింది.
భారతదేశంలోని మొబైల్ వినియోగదారులు జూలై 20న కూడా ఇదే విధమైన పరీక్ష హెచ్చరికను అందుకున్నారు. బిగ్గరగా అలారం, బీప్ శబ్దంతో కూడిన సందేశంతో వినియోగదారుల మొబైల్ ఫోన్‌లో హెచ్చరిక పొందారు. వినియోగదారు OK అని నొక్కినంత వరకు ఈ బీప్ వస్తూనే ఉంటుంది. హెచ్చరిక సందేశం చదివినట్లు నిర్ధారించడం దీని ఉద్దేశ్యం.
అలర్ట్ టెక్స్ట్ లో ఎం ఉంది?
ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు.ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీచే అమలు చేయబడుతున్న TEST పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌కు పంపబడింది, ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడం మరియు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది,” ఈ సందేశం నిర్దిష్ట ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు పంపబడినట్లు నివేదించబడింది.

హెచ్చరికపై DoT ప్రకటన
Telecom వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం మరియు ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించబడతాయని, టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.
భూకంపాలు, సునామీలు మరియు ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి వినియోగదారులను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీతో కలిసి ఇందుకోసం పనిచేస్తోంది.
One response to “Emergency Alert : అని మీ ఫోన్ కి మెసేజ్ ఏమైనా వచ్చిందా అయితే ఈ డీటైల్స్ మీకోసమే”
Can you tell me any problem or solution for this emergency allot