ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ రైతు బంధు పంపిణీ కి అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఊతర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 28 లోపు ఈ పంపిణీ పూర్తి చేయాలని సూచించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం 27 వరకు పంపిణీ చేయలేదు. సోమవారం చేయాలని భావించినప్పటికీ భారాసా ఎన్నికల కోడ్ ను ఉల్లంగించందనే ఫిర్యాదు తో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను తిరిగి వెనక్కి తీసుకుంది.
అసలు ఏం జరిగింది..
నవంబర్ 25, 26, 27 తేదీలలో వరుసగా బ్యాంకు సెలవులు ఉన్న నేపథ్యంలో 28 న అమౌంట్ చేయాలని ప్రభుత్వం భావించింది.
ఎన్నికల ముందు రైతు బంధు పంపిణీ అనుమతించినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులను విధించింది. ఈ పంపిణీ రాజకీయ ప్రచారం కోసం వాడుకో రాదని షరతులు విధించింది. ఎటువంటి బహిరంగ ప్రకటనలు కూడా దీనికి సంబంధించి చేయరాదని తెలిపింది.
అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రి పబ్లిక్ గా దీనిపై ప్రకటన చేశారు. సెలవులు ముగిసిన అనంతరం రైతులు తమ అల్పాహారం ముగించే లోపే నగదు నేరుగా తమ బ్యాంక్ ఖాతాలో పొందుతారని ప్రకటన చేయడం చర్చకు దారి తీసింది.
రబీ యాసంగి సీజన్ కు సంబందించి రైతుబంధు పంపిణీ ఇప్పుడు చేపట్టితే ఓటర్లపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ తిరిగి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వం దీనిని ప్రచార అస్త్రంగా వాడుకుంటుందని పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం, 25 26 27 తేదీలలో బ్యాంకు సెలవులు, 28 సాయంత్రానికి ప్రచార గడువు ముగిస్తుండటంతో 29 , 30 తేదీలలో పంపిణీకి అనుమతించలేదు.
ఈ మేరకు తమ అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి EC తెలిపింది. దీంతో 70 లక్షల మందికి రైతుబంధు ప్రస్తుతానికి వాయిదా పడింది.
మరోవైపు కాంగ్రెస్ తాము రైతుబంధు కి వ్యతిరేకం కాదని, అయితే నవంబర్ 15 లోపే ఈ పంపిణీ పూర్తి చేయమని కోరామని కానీ ప్రభుత్వం నెలాఖరులోనే చేసి ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చూస్తుందని ఇది సరికాదని వాదించింది. ఏదేమైనా ప్రస్తుతానికి రైతుబంధు అయితే వచ్చే ఎన్నికల తర్వాతనే జమ కానుంది.
Leave a Reply