పదవి విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ (employee health scheme) వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
2020 జనవరి 1 తరువాత రిటైర్ అయిన వారందరికీ కూడా ఈహెచ్ఎస్ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపింది.
EHS నెట్వర్క్ ఆసుపత్రులతో పాటు ఆర్టీసీ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్యం మందుల అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
వన్ టైమ్ ప్రీమియం వివరాలు
రిటైర్ అయిన ఉద్యోగులు ఒకసారి కింద పేర్కొన్న ప్రీమియం చెల్లిస్తే ఉద్యోగి కి మరియు ఉద్యోగి భార్య కు జీవితాంతం ఇష్ట వైద్యం ప్రభుత్వం అందిస్తుంది.
- సూపరిటెండెంట్ క్యాటగిరి వరకు ఉన్నవారు 38,572 ప్రీమియం చెల్లించాలని తెలిపింది.
- అసిస్టెంట్ మేనేజర్ మరియు ఆ పై ర్యాంక్ ఉన్నవారు 51,429 చెల్లించాలి.
తాజా నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి.


