రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముఖ్య సమాచారం.
2022 23 సంవత్సరానికి గాను రైతులు సాగు చేసినటువంటి రబి పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ఈ మేరకు గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ పంట నమోదు కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
ఇప్పటికే అన్ని జిల్లాలలో దాదాపు 95% నుంచి 100% వరకు ఈ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైతే ఇంకా రబి పంట నమోదు చేసుకోలేదు వారికి ఈరోజు వరకు అవకాశం కల్పించడం జరిగింది.
కాబట్టి ఈ క్రాప్ నమోదుకు నేడే చివరి అవకాశం.
రైతులు తమ పాస్ పుస్తకం,ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్ తో రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాల్సిందిగా అధికారులు తెలిపారు.
ఈ క్రాప్ నమోదు చేయకపోతే ఏమవుతుంది?
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ పంట అనగా ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ప్రతి సీజన్లో రైతులు సాగు చేసే తమ పంట వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియపరచాల్సి ఉంటుంది. ఈ క్రాప్ చేయని పక్షంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లభించే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్, వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకం, వైయస్సార్ పంట రుణాల పథకం వంటి పథకాలు వర్తించవు.
కాబట్టి రైతులు తప్పనిసరిగా తమ సమీప రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
Leave a Reply