ఏపి లో అగ్రవర్ణ కులాలలో ఉండేటటువంటి పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం పేరుతో పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అగ్రవర్ణ OC కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వారికి ప్రతి ఏటా 15 వేల రూపాయలను వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
ఈ బీసీ నేస్తం 2023 తేదీ ఎప్పుడంటే
ఇందులో భాగంగా 2023 సంవత్సరానికి సంబంధించి వరుసగా మూడో ఏడాది అమౌంట్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ బీసీ నేస్తం 2023 అమౌంట్ విడుదల తేదీని ప్రకటించడం జరిగింది.
ఈ ఏడాది అనగా 2023 ఈ బీసీ నేస్తం పథకాన్ని ఏప్రిల్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.
EBC Nestham 2023 Release Date: 12 April 2023
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాల అయినటువంటి రెడ్డి, కమ్మ, వైశ్య, క్షత్రియ తదితర అగ్రవర్ణ కులాలకు చెందిన మహిళలకు 15వేల రూపాయలను వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
ఈ పథకానికి అర్హతలు ఏమిటి ?
OC కులాలకు చెంది ఆర్థికంగా వెనక బడిన మహిళలు ఈ పథకానికి అర్హులు
45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు గానీ ఉండరాదు. అదేవిధంగా మున్సిపల్ ఏరియాలో 1000 sq ft స్థలం కంటే ఎక్కువ ఉండరాదు.
కుటుంబంలో ఎవరికి 4 వీలర్(లేదా కారు) ఉండరాదు.
పల్లెల్లో ఉండే వారికి నెలకు 10,000 పట్టణాల్లో ఉండే వారికి నెలకు 12 వేల ఆదాయం మించరాదు.
విద్యుత్ బిల్లు ఆరు నెలల వ్యవధి కాలంలో ఏ నెలలో కూడా 300 యూనిట్లు మించరాదు.
కాపు సామాజిక వర్గం వారు ఓసి పరిధిలోకి వచ్చినప్పటికీ వారికి ఈ పథకం వర్తించదు. ఎందుకంటే వారికి మరొక పథకం కాపు నేస్తం ఇస్తున్నారు గనుక.
ఇది ఈ బీసీ నేస్తం పథకానికి సంబంధించిన కీలకమైన అప్డేట్.
ఈ పథకానికి సంబంధించి రెగ్యులర్గా అప్డేట్స్ కింది లింక్ ద్వారా పొందవచ్చు.
Leave a Reply