ఏపి లోని పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత రేషన్ మరియు సబ్సిడీ సరుకులు పొందాలంటే రేషన్ లేదా రైస్ కార్డ్ తప్పనిసరి. సంవత్సరం పొడుగునా అర్హులైన వారు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరం లో రెండు సార్లు అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తారు.
ఈ రేషన్ లేదా రైస్ కార్డును ఆన్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Digi Locker వెబ్సైట్ ద్వారా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం [AP Ration Card Download Process Using Digi Locker]
𝐒𝐭𝐞𝐩 1 : మీ రేషన్ కార్డు వివరాలను తెలుసుకోవడానికి ముందుగా కింద ఇచ్చిన లింకును క్లిక్ చెయ్యండి.
Digi Locker వెబ్సైట్ ఓపెన్ అయిన తరువాత SIGN IN బటన్ పైన క్లిక్ చెయ్యండి.
Sign in పైన క్లిక్ చేసిన తరువాత లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు digi Locker అకౌంట్ లేకపోతే Signup ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి
Sign up పైన క్లిక్ చేసిన తరువాత రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు సంబంధించిన వివరాలను నమోదు చేసి, submit పైన క్లిక్ చెయ్యండి.
Submit పైన క్లిక్ చేసిన తరువాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ కి otp వస్తుంది.
మీ మొబైల్ నంబర్ కి వచ్చిన otp ఎంటర్ చేసి verify బటన్ పైన క్లిక్ చెయ్యండి.
మీ మొబైల్ నంబర్ వెరిఫై చేసిన తరువాత, మీ ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయండి
ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేసిన తరువాత, లింక్ అయిన మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఆ OTP ని ఎంటర్ చేసి Submit బటన్ పైన క్లిక్ చెయ్యండి.
వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత, digi Locker వెబ్సైట్ లోకి మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక పైన ఉన్న మూడు గీతలు (Menu) ఉన్న ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
Menu ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత, Search Documents ఆప్షన్ కనిపిస్తుంది.
Search Documents ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత, సెర్చ్ బార్ లో Rice Card అని టైప్ చెయ్యండి. Search చేసిన తరువాత వచ్చిన లిస్ట్ లో Ration Card – Food & Civil Supplies Department, Andhra Pradesh ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
Ration Card ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మీ రేషన్/ రైస్ కార్డ్ వివరాలను నమోదు చేయండి. కేవలం కొత్త రైస్ కార్డ్ నంబర్ మాత్రమే ఎంటర్ చెయ్యాలి.
రేషన్ కార్డు వివరాలను నమోదు చేసి, get data ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత మీ వివరాలను పరిశీలించి, వివరాలను చూపిస్తుంది.
వివరాలు పరిశీలించిన తర్వాత issued documents లో రేషన్ కార్డ్ ఆప్షన్ యాడ్ అవుతుంది. రేషన్ కార్డ్ ఆప్షన్ కనిపించిన తర్వాత పక్కన ఉన్న మూడు చుక్కల ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి లేదా డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి
Download ఆప్షన్ చెక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయ్యే ఫైలు ఏ ఫార్మేట్ లో కావాలో ఎంచుకోవాలి. వివరాలు అర్థం కావడం కోసం PDF ఆప్షన్ ని ఎంచుకోండి
పిడిఎఫ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డు మీ మొబైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పిడిఎఫ్ ఓపెన్ చేస్తే,మీ రేషన్ కార్డు వివరాలు చూపిస్తాయి
Digi Locker యాప్ ద్వారా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకొనే విధానం
మీ రేషన్ కార్డు వివరాలను digi Locker యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా digi Locker యాప్ డౌన్లోడ్ చేసుకోండి
డిజి లాకర్ ఆప్ ఓపెన్ చేసిన తర్వాత కింది విధంగా చూపిస్తుంది. హోమ్ స్క్రీన్ లో Get Started బటన్ పైన క్లిక్ చేయండి.
Get Started బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత sign in & create account ఆప్షన్లు కనిపిస్తాయి
సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత రెండు విధాలుగా లాగిన్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలనుకున్నవారు మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి
ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలనుకున్నవారు ఆధార్ పైన క్లిక్ చేస్తే, ఆధార్ నెంబర్ మరియు పిన్ నెంబర్ అడుగుతుంది
ఒకవేళ మీకు డిజి లాకర్లో అకౌంట్ లేనట్లయితే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మరియు మీరు ఎంచుకోవలసిన ఆరు అంకెల పిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి
సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటిపి సెండ్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన ఓటిపి నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి.
మొబైల్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత మీ ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి.
నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ తో లింక్ అయినా మొబైల్ నెంబర్ కు ఆరు అంకెల ఓటిపిని సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటిపి వివరాలను నమోదు చేసి submit పైన క్లిక్ చేయండి
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ మరియు 6 అంకెల పిన్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
ఒకవేళ మీరు మీ సెక్యూరిటీ పెన్ మర్చిపోయినట్టయితే ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఓటిపి ద్వారా పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు.
మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి కి ఓటిపి వస్తుంది. ఆ ఓటిపిని ఎంటర్ చేసి వెరిఫై చేయండి
లాగిన్ అయిన తర్వాత మీ వివరాలను హోం స్క్రీన్ లో చూడవచ్చు. మీ రేషన్ కార్డు వివరాలను డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న సెర్చ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి
క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బార్ లో రేషన్ కార్డ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫలితాలలో Ration Card – Food & Civil Supplies Department, Andhra Pradesh ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ పేరు మరియు మీ జెండర్ వివరాలు చూపిస్తాయి. మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, get document బటన్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డు వివరాలు సంబంధిత డిపార్ట్మెంట్ సర్వర్ నుంచి డౌన్లోడ్ అవుతుంది
డౌన్లోడ్ అయిన తర్వాత మీ హోం స్క్రీన్ లో రేషన్ కార్డ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. రేషన్ కార్డు పైన క్లిక్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డు వివరాలు చూపిస్తాయి.
ఈ వివరాలను మీరు మీ మొబైల్లో పొందాలనుకుంటే కింద ఉన్న డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి.
Leave a Reply