రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు ప్రభుత్వం ద్వారా అనుసంధానించబడినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన చికిత్స ఉచితంగా పొందాలంటే ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరి.
ఆరోగ్యశ్రీ కార్డును మీరు పోగొట్టుకున్న లేదా సరైన సమయానికి మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు.
వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలి అంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి.
కింది ప్రాసెస్ ద్వారా మీరు ఆన్లైన్లో సులభంగా ఆరోగ్యశ్రీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ కార్డ్ అసలు చలామణిలో ఉందా? మీ కుటుంబ వివరాలు సరిగా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఆన్లైన్ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబ వివరాలు సరిగ్గా లేకపోతే మీ ఆరోగ్యశ్రీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆసుపత్రికి వెళ్ళేముంది మీ స్టేటస్ ను చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా సవరణలు ఉంటే మీ సమీప సచివాలయంలో సంప్రదించవచ్చు.
ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ ఇలా చూడండి [Check Aarogyasri Status]
How to Know Arogyasri Card Status ?
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Login పై క్లిక్ చేయండి.
User Name : aarogya_mithra
Password : guest
ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.
Step 3 : ఎడమ వైపు Check Arogyasri Status అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
Step 4 :
- Enter Ration Card No / Reference Number లొ పాత రేషన్ కార్డు నెంబర్ లేదా ఆరోగ్య శ్రీ కార్డుకు దరఖాస్తు చేయు సమయం లొ ఇచ్చిన రసీదు లొ ఉన్న నెంబర్ అయినా వేయాలి.
- Enter UHID No వద్ద ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
- Enter Aadhar No లొ ఆ కుటుంబం లొ ఉన్నా ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Check Status పై క్లిక్ చేయాలి.
Step 5 : ఆరోగ్య శ్రీ కార్డుకు సంబందించిన
- Reference No / Ration Card No,
- UHID No,
- Secretariet Name,
- Member Name,
- Aadhaar Number,
- Resident ID,
- Relationship,
- Age,
- Status,
- Enrollment / Edit Date,
- Volunteer Name,
- Request For
వివరాలు వస్తాయి.
Note : స్టేటస్ Eligible అని ఉంటే కార్డు చలామని లొ ఉన్నట్టు అర్థము.
ఆరోగ్యశ్రీ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి ? [Download Arogyasri Card]
How to Download Arogyasri Card ?
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Login పై క్లిక్ చేయండి.
User Name : aarogya_mithra
Password : guest
ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.
Step 3 : ఎడమ వైపు Generate AAROGYASRI Digital Card అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
Step 4 :
- Enter UHID లొ ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్,
- Enter Reference Number లొ అప్లికేషన్ నెంబర్,
- Enter Registered Aadhaar Number లొ ఇంట్లో ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Generate Digital Card పై క్లిక్ చేయాలి.
Step 5 : వెంటనే Pop Up ఓపెన్ అవుతుంది. అందులో OK కాకుండా Download అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పడు PDF రూపం లొ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
Leave a Reply