దేశ వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ ప్రక్షాళన కు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అయింది. ఇందుకు సంబంధించి జూలై 21 నుంచి నెల రోజుల పాటు ఓటర్ సర్వే ను ప్రారంభించడం జరిగింది.
జూలై 21 నుంచి నెల రోజులపాటు వెరిఫికేషన్
జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర , జిల్లా స్థాయి అధికారులు సమగ్ర ఓటర్ సర్వే ను చేపడతారు.
ఇప్పటికే ఓటర్ ప్రక్షాళన, మార్పులు చేర్పులు పై బూత్ లెవెల్ స్థాయి అధికారుల కు ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు శిక్షణ ఇచ్చారు.
ఓటర్ సర్వే లో పరిశీలించే అంశాలు ఇవే
- ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు ఏమైనా ఉంటే.. నకిలీ ఓట్ల గుర్తింపు వంటివి చెక్ చేస్తారు
- చనిపోయిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుంది
- వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తించడం జరుగుతుంది
- ఒకే డోర్ నంబర్ పై చాలా ఎక్కువ ఓట్లు ఉన్నా, లేదా డోర్ నంబర్ లేకున్నా చెక్ చేస్తారు
- సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్ఆర్ ఓటర్ల వివరాలను సరిచేయడం.
- దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కొని అందుకు అనుగుణంగా మార్పులు చేయడం
- ఒక బూత్లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉన్నచో కొత్త బూతు సిఫార్సు చేయడం
- పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్
నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు,
చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం కూడా ఈ సర్వే లో చేస్తారు. - ఓటర్ల అభ్యర్థన మేరకు తమ ఓటును ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం వంటివి చేపడతారు
కొత్త గా 18 యేళ్లు నిండిన వారు లేదా జనవరి 1 2024 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు కొత్త ఓటు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఇంటికి భూత్ స్థాయి అధికారులు వచ్చినప్పుడు వారి వద్ద ఫార్మ్ 6 తీసుకొని నింపి ఆధార్ జత చేసి ఇవ్వగలరు.
ఇంటింటికి నెల రోజుల పాటు భూత్ లెవెల్ అధికారులు ఈ సర్వే కోసం పర్యటిస్తారు.
Leave a Reply