రేషన్ దుకాణాల ద్వారా గోధుమ పిండిని అందించాలని ఏపీ సర్కారు ఇది వరకే నిర్ణయించింది. గోధుమ పిండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చౌక ధరల దుకాణాల ద్వారా గోధుమ పిండిని సబ్సిడీ ధరలకే అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోధుమ పిండి విక్రయాలను ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ మరియు నగర డిపోల్లో విక్రయాలు జరుపుతున్నారు.
రాష్ట్రంలోని బియ్యం కార్డుదారులకు అక్టోబర్ నుంచి ఫోర్టిఫైడ్ గోధుమపిండిని పంపిణీ చేయనున్నట్లు
పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఒక్కో కార్డుకు కిలో ప్యాకెట్ను రూ.16 చొప్పున సరఫరా చేస్తామని పేర్కొంది. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో గోధుమపిండిని సరఫరా చేస్తున్నప్పటికీ, అక్టోబర్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ తాజాగా గోధుమ పిండి కూడా అందిస్తోంది.
ఒక్కో కార్డు పై రెండు కిలోల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని మంత్రి లబ్దిదారులకు అందించారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు.
రాష్ట్రంలోని 6,94,755 కార్డు దారులకు ప్రస్తుతం గోధుమపిండి పంపిణీ చేయనున్నారు.
ఏపీలో పేదలకు చిరుధాన్యాలను అందించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ జొన్నలు, రాగుల పంపిణీ మళ్లీ ప్రారంభించాలి నిర్ణయించింది. UNO 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో పాటూ కేంద్రం కూడా చిరు ధాన్యాలను ప్రోత్సహిస్తోంది. అందుకే జొన్నలు, రాగులు రేషన్ షాపుల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. అందుకే కొన్ని వివరాలు సేకరిస్తోంది. రేషన్ కార్డుదారుల్లో ఎంతమంది వీటిని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారని ఆరా తీస్తోంది.
ఒక్కో రేషన్ కార్డు కుటుంబానికి 2 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలనుకుంటోంది. బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. వాటికి బదులు 2 కిలోల రాగులు, జొన్నలు తీసుకునేలా అంగీకరిస్తారా లేదా అని పత్రాలపై సంతకాలు కూడా తీసుకుంటున్నారు. ఈ సర్వే పూర్తికాగానే పంపిణీపై కసరత్తు చేయనున్నారు. ప్రభుత్వం గోధుమ పిండి పంపిణీని ప్రారంభించగా.. చిరు ధాన్యాలను కూడా పంపిణీ చేయనుంది.
Leave a Reply