కేవలం ఆధార్ నంబరు ఉపయోగించి వినియోగదారులు అభ హెల్త్ ID సులభంగా ఆన్లైన్ లో జెనరేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ అభ కార్డు ఉంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అభాకార్డు అంటే ఏంటి? అబా కార్డ్ మరియు ఆయుష్మాన్ భారత్ కార్డ్ రెండు ఒకటేనా? ఈ అంశాలను ఈరోజు తెలుసుకుందాం.
అభా కార్డ్ అంటే ఏమిటి? [What is Abha Card]
ఆధార్ నంబర్తో ఆన్లైన్లో సులభంగా అభ కార్డును జనరేట్ చేసుకోవచ్చు. మెడికల్ రికార్డులు, ల్యాబ్ రిపోర్టులు రిస్క్రిప్షన్లు మరియు డయాగ్నసిస్ వంటి రికార్డులను ఒకే చోట సులభంగా భద్రపరుచుకునెందుకు ABHA హెల్త్ ID పనికివస్తుంది.
కేవలం ఈ కార్డు ఉన్నట్లయితే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నట్లు భావించడం తప్పు.
ఆయుష్మాన్ భారత్ కార్డు వేరు అభా కార్డు వేరు.. అభా కార్డుని సాధారణంగా ఎవరైనా సులభంగా తమ ఆధార్ తో ఆన్లైన్లో పొందవచ్చు. తమ మెడికల్ రికార్డులను భద్ర పరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
అయితే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు మాత్రం ఇందుకు భిన్నం. ఇది కేవలం అర్హత ఉన్నటువంటి పేదవారికి మాత్రమే లభిస్తుంది. అసలు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు అంటే ఏంటి పూర్తి డిటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Ayushman హెల్త్ కార్డ్ అంటే ఏమిటి? అర్హతలు
ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది పేద మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నగదు రహిత అనగా క్యాష్ లెస్ ఆరోగ్య సేవలను అందించడానికి ఉద్దేశించిన కార్డ్. ఇది ప్రధానమంత్రి PM JAY పథకం ద్వారా అర్హత ఉన్న వారికి జారీ చేయడం జరుగుతుంది. ఈ కార్డు ఉన్నవారికి ₹5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల తో పాటు ఎంపానెల్డ్ ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత Cashless చికిత్సను ఉచితంగా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా, ఖరీదైన మోకాలి మార్పిడి, కరోనరీ బైపాస్ మరియు ఇతర శస్త్రచికిత్సలు కూడా ఇందులో చేయబడతాయి.
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అర్హతలు:
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు పొందేందుకు ఆర్థికంగా బలహీనవర్గాలు అనగా EWS లేదా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారు మాత్రమే అర్హులు.
అసలు ఈ ఆయుష్మాన్ కార్డ్ కి అర్హత ఉందా లేదా అనేది కింది అధికారిక లింక్ ద్వారా చెక్ చేయవచ్చు.
కింద ఇవ్వబడిన లింక్ లో “Am I Eligible” అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు అర్హత ఉందో లేదో చెక్ చేయండి
Official link : https://pmjay.gov.in/
లేదా కింద ఇవ్వబడిన హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి కూడా మీ అర్హత ను తెలుసుకోవచ్చు.
Toll-free numbers – 📞 14555 or 1800-111-565
ప్రత్యేక క్యాంపుల ద్వారా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు లేదా మెడికల్ కాలేజీల వద్ద అర్హతలను చెక్ చేసి ఈ కార్డులను జారీ చేస్తున్నారు.
మీకు అర్హత ఉన్నట్లయితే ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అర్హత చెక్ చేసిన తర్వాత సంబంధిత ఫారం ఓపెన్ అవుతుంది. అందులో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మీ సమీప మీసేవ లేదా CSC సెంటర్ కి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Conclusion: కాబట్టి అభా కార్డు వేరు ఆయుష్మాన్ భారత్ కార్డ్ వేరు. అభ కార్డును ఎవరైనా సులభంగా తమ మెడికల్ రికార్డులను పొందుపరచు కునేందుకు ఆధార్ ఉపయోగించి ఆన్లైన్లో పొందవచ్చు. కానీ అర్హత ఉన్న పేదవారికి మాత్రమే ఆయిష్మాన్ కార్డు జారీ చేయడం జరుగుతుంది.
Leave a Reply