భారతీయ బ్యాంకులలో డిపాజిట్లపై లేదా లోన్లపై వడ్డీ రేట్లు తరచు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే రెపోరేట్ ఆధారంగా మారుతూ ఉంటాయి.
వరుసగా గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు రేపు పెంచిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరోసారి పెంచడానికి సిద్దమైంది.
కాబట్టి బ్యాంకుల్లో మీ అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటే కాస్త ఆగితే మంచిది.. అయితే రుణం పొందాలనుకునే వారు మాత్రం ఇప్పుడు తీసుకుంటే బెటర్.
రేపో రెట్ అంటే ఎంటి? వడ్డీకి రెపోరేట్ కి ఏంటి సంబంధం
బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాన్ని ఇచ్చే వెసులు బాటు ఉంటుంది. ఆ రుణం పై RBI వేసే వడ్డీనే మనం రేపో రేటు అని అంటాము.
ఈ రెపో రేట్ పెరగడం వలన బ్యాంకులకు తాము తీసుకునే రుణంపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి తదు అనుగుణంగా లిక్విడిటీ మెయింటైన్ చేయడానికి, అంటే తమ డిపాజిట్లు మరియు లోన్లను సమపాళ్లలో ఉంచడానికి బ్యాంకులు కస్టమర్ల నుంచి డిపాజిట్ లు, లోన్లకు సంబంధించి వడ్డీ రేట్లను కూడా మారుస్తుంటాయి.
రేపు రేటు పెరగడం వలన బ్యాంకులో తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా పెంచుతాయి.. తద్వారా కస్టమర్లకు అధిక వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా రుణాలు మరింత భారం కానున్నాయి.రేపో రేటు పెరిగితే కస్టమర్ల నుంచి రుణాలపై అధిక వడ్డీని వసూలు చేస్తాయి. తగ్గితే ఈ ప్రభావం రివర్స్ లో ఉంటుంది.
కాబట్టి చివరగా ఎవరైతే బ్యాంకుల్లో Fixed డిపాజిట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏప్రిల్ మొదటి వారం వరకు ఆగితే మంచిది. ఎందుకంటే రేపో రెట్ పెరిగే అవకాశం ఉంది తద్వారా మీకు లభించే వడ్డీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరు కు బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు సవరించే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావంతో సుకన్య సమృద్ధి, పిపీఎఫ్ ఎంపీఎస్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలపై కూడా కేంద్రం వడ్డీని పెంచనున్నట్లు సమాచారం.
RBI రేపో రేటును ఎప్పుడు, ఎంత పెంచే అవకాశం ఉంది?
ఏప్రిల్ 3, 5, 6 తేదీలలో జరగనున్న 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లో భాగంగా ఆర్బిఐ ఈ రేటు ను పెంచే అవకాశం కనిపిస్తున్నట్లు ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరో 25 బేసిస్ పాయింట్స్ పెంచి 6.75కి repo rate ను తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బిఐ నుంచి రుణం మరింత భారం అయ్యి, డిపాజిట్ల సేకరణ కోసం కస్టమర్లకు అధిక వడ్డీని పెంచి డిపాజిట్లు సేకరించే అవకాశం ఉంటుంది. అయితే లోన్ తీసుకోవాలనుకునే వారు ప్రస్తుతం తీసుకుంటే మంచిది.
Leave a Reply