Deepam Scheme 2024 – Free Gas Booking in AP దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హతలు, అప్లికేషన్, పేమెంట్ స్టేటస్ పూర్తి వివరాలు

Deepam Scheme 2024 – Free Gas Booking in AP దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హతలు, అప్లికేషన్, పేమెంట్ స్టేటస్ పూర్తి వివరాలు

Deepam Scheme 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగమైనటువంటి దీపం పథకం కింద ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు అందించడం జరుగుతుంది. ఈ దీపం పథకానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లను (free gas cylinder scheme Andhra Pradesh) పొందాలంటే అసలు అర్హతలు ఏంటి, ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇస్తారు, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు ఇంకా పేమెంట్ ఎలా చేస్తారు అని పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అంటే ఏమిటి – [ What is Free Gas Cylinder Scheme]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు పేదవారికి సిలిండర్లపై ఆర్థిక భారం తగ్గించే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పథకమే దీపం పథకం. ఈ పథకాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా అమలు చేయగా అయితే అప్పట్లో కేవలం గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం రెండవ దశ కూటమి ప్రభుత్వంలో ఈ పథకాన్ని ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో అనుసంధానం చేయడం జరిగింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పేద మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తుంది. సూపర్ సిక్స్ పథకాల లో భాగమైనటువంటి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీపావళి రోజు అనగా అక్టోబర్ 31న ప్రారంభిస్తారు.

October 29 నుంచి ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.. ఎవరికైనా ఉచిత సిలిండర్ ఇవ్వకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చు.

  • Scheme Name: Deepam Scheme 2024 – Free Gas Cylinder scheme Andhra Pradesh
  • Booking Date for First Cylinder: 29 October 2024 at 10 AM (delivers on 31 October)
  • Deepam Scheme launch date: 31 October 2024
  • Number of Free Gas Cylinders per year : 3 [ Every Four months]
  • Deepam Scheme Schedule – 1 free Cylinder can be availed between 31st October to March 2024. From the next financial year 2025-2026,  3 cylinders every four months can be availed.
  • Deepam Scheme Application Process: All eligible white ration card holders
  • Deepam Scheme Payment Status: Applicable subsidy amount will be transferred in 48 hours to beneficiary bank account
  • Deepam Scheme eligible gas agencies : Indane, HP, Bharat Gas connections

ఉచిత గ్యాస్ బుకింగ్ తేదీ – Free Gas Booking Starting Date

ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం. సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుంది. సిలిండర్ అందిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ

దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హతలు – Deepam Scheme Free Gas Cylinder Scheme Eligibility 2024-25

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద సిలిండర్ పొందాలంటే కింది అర్హతలు కలిగి ఉండాలి.

  • సదరు లబ్ధిదారుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • బిపిఎల్ అనగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • ఇండేన్, హెచ్ పి, భారత్ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
  • లబ్ధిదారుడు సరైన ఆధార్ కార్డు, గ్యాస్ పుస్తకం, ఆధార్ కార్డుకి మరియు గ్యాస్ పుస్తకానికి (ekyc) లింక్ మరియు ఆధార్ మరియు మొబైల్ నెంబర్ కి కూడా ముందుగా లింక్ చేసుకొని ఉండటం మంచిది. 
  • నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ మాత్రమే ఉచితం.

సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి డేటా ఆధారంగా లబ్ధిదారులను గుర్తించడం జరిగింది.

Free Gas Cylinder Scheme Eligibility

దీపం పథకం షెడ్యూల్ ఇలా: Deepam Scheme Schedule – ప్రస్తుతం అక్టోబర్ 31 నుంచి మార్చి 2025 వరకు ఒక సిలిండర్ ఉచితంగా పొందవచ్చు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం అనగా 2025-26 నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ ఉచితంగా పొందవచ్చు. అంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 లోపు మూడు ఉచిత సిలిండర్లను పొందవచ్చు.

దీపం పథకం అప్లికేషన్ ప్రాసెస్ మరియు కావాల్సిన డాక్యుమెంట్లు – Deepam Scheme 2024 Application Process and Required documents

దీపం పథకాన్ని తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వర్తింప చేస్తుంది. ప్రభుత్వం వద్ద ఉన్న డేటాని గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.

ఇందుకు సంబంధించి ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత గ్యాస్ ఏజెన్సీ లతో ఒప్పందం చేసుకుంది.

దీపం పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు: బిపిఎల్ అనగా తెల్ల రేషన్ కార్డ్ (రైస్ కార్డు), గ్యాస్ కనెక్షన్ పుస్తకం (Indane, HP, Bharat Gas), మహిళ పేరు పైన బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఆధార్ మొబైల్ అనుసంధానం మరియు ఆధార్ తో బ్యాంక్ ఖాతా మరియు గ్యాస్ కనెక్షన్ అనుసంధానం కలిగి ఉండాలి.

Deepam Scheme

దీపం పథకం అమౌంట్ ఎలా చెల్లిస్తారు,  స్టేటస్ ఎలా చూడాలి – Deepam Scheme Amount and Payment Status

దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందిన వెంటనే సదరు లబ్ధిదారుడు సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి తప్పనిసరిగా ప్రస్తుతం చెల్లిస్తున్నట్లుగానే అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమౌంట్ చెల్లించిన తర్వాత 48 గంటల్లో సంబంధిత లబ్ధిదారుని యొక్క బ్యాంక్ ఖాతాలో డిబిటి (DBT) పద్ధతిలో అమౌంటును రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹825-850 వరకు గ్యాస్ సిలిండర్ కి అమౌంట్ ను వసూలు చేస్తున్నారు. ఈ పూర్తిగా అమౌంట్ ను  రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఖాతాలో డెలివరీ చేసిన 48 గంటల లో నేరుగా జమ చేస్తుంది.

Free Gas Booking Apps

GasBooking App Link
Indane GasIndianOil ONE
HP GasHP PAY
Bharat Petroleum Corporation Ltd (BPCL)HelloBPCL

దీపం పథకానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

Click here to Share

4 responses to “Deepam Scheme 2024 – Free Gas Booking in AP దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హతలు, అప్లికేషన్, పేమెంట్ స్టేటస్ పూర్తి వివరాలు”

  1. B VEERABABU Avatar
    B VEERABABU

    ఇప్పుడు కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుందా

  2. K.Bhaskarreddy Avatar
    K.Bhaskarreddy

    Good

  3. Raj Avatar
    Raj

    Hi, Currently every month, after booking gas online(Through Amazon Pay/HP Pay), the subsidy amount(Rs.3.95) is getting credited to the bank account of my father(LPG Connection is in the name of my Father) every month. To be eligible for this scheme – Should the LPG connection needs to be changed in the name of my mother ??
    And Booking has to be mandatorily to be done offline mode itself ?? Online mode of booking isn’t eligible ??
    Please clarify the above 2 points and Thanks in Advance.

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Not necessarily

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page