ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నెల పింఛన్

ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నెల పింఛన్

ఎన్టీఆర్ భరోసా కింద డిసెంబరు నెల పింఛన్లను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు అందించనుంది.డిసెంబరు 1న ఆదివారం సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే నవంబరు 30న ప్రభుత్వం పింఛన్ల పంపిణీని చేపట్టనుంది.

నవంబరు 30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండో తేదీన సోమవారం అందించనుంది. అప్పటికీ తీసుకోని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి జనవరి ఒకటో తేదీన ఇవ్వనున్నారు.

నవంబరులో పింఛను తీసుకోని 21,788 మందికి రెండు నెలల మొత్తం కలిపి డిసెంబరులో అందజేస్తారు. మొత్తంగా డిసెంబరులో 63.92 లక్షల మందికి రూ.2,709 కోట్లపింఛను నగదు పంపిణీ చేయనున్నారు.


Click here to Share

You cannot copy content of this page