రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.చాలా రోజులుగా DA బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు డిఎం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులలో పేర్కొంది.
ఉద్యోగులకు డీఏ, పింఛనర్లకు 2.73 శాతం డీఆర్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. 2023 జూన్ 1 నుంచి కొత్త డీఏను జీతంతో కలిపి ఇస్తామని ప్రకటించింది. డీఏ బకాయిలను 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్, డిసెంబర్, మార్చిలో చెల్లిస్తామని వెల్లడించింది. కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల డీఏ
22.75 శాతానికి చేరిందని ప్రభుత్వం వివరించింది.
Leave a Reply