రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ బూస్టర్‌ డోసు

రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ బూస్టర్‌ డోసు

ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను అతలా కుతలం చేసిన కరోనా వైరస్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కూడా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రేపటి (19-April-2023) నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్‌ డోస్‌ పంపిణీ చెయ్యనున్నారు.

5 ల‌క్ష‌ల కార్బేవ్యాక్స్ టీకా డోసుల‌ను బుధవారం నుంచి అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మొద‌టి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్న వారు బూస్ట‌ర్ డోస్ గా కార్బే వ్యాక్స్ తీసుకోవ‌చ్చని అధికారులు తెలిపారు.

You cannot copy content of this page