వినియోగదారులకు గుడ్ న్యూస్.. గత ఏడాది తారస్థాయికి చేరినటువంటి వంట నూనె ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్న విషయం తెలుసిందే అయితే తాజాగా అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గిన నేపథ్యంలో దేశీయంగా కూడా నూనె ధరలను మరింత తగ్గించాలని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
ఎంత మేర రేట్లు తగ్గించారు
లీటర్ ధరకు 8 నుంచి 12 రూపాయల వరకు తగ్గించాలని పరిశ్రమ వర్గాలతో జరిగిన సమావేశంలో ఆహార మంత్రిత్వ శాఖ ఆయా కంపెనీలకు సూచించడం జరిగింది. ఈ నిర్ణయంతో ద్రవ్యోల్బణం పై ఆందోళన కూడా కొంతమేర తగ్గుతుందని ఆహార మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గినప్పటికీ దేశీయ మార్కెట్లో ధరలు తగ్గడం లేదని అందుకే ఈ సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది. నూనె కంపెనీలు తక్షణమే ఈ ధరలను తగ్గించాలని కోరడం జరిగింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో నూనె ధరలు ఆమాంతం చుక్కలు చూపించాయి.. అయితే గత ఏడాది జూన్ నుంచి ఈ నూనె ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించిన తర్వాత మరింతగా ధరలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరింత గా ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో నూనె ధరలు 110-130 వరకు పలుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా తీసుకున్న నిర్ణయంతో నూనె ధరలు 100 నుంచి 120 రూపాయలు కిందకు దిగిరానున్నాయి. సామాన్య ప్రజలకు ఇది చాలా ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు.
Leave a Reply