తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నిర్వహించినటువంటి జనగర్జన సభలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు.
తాము అధికారంలోకి రాగానే వృద్ధులు మరియు వితంతువులకు 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. ఈ పెన్షన్ పంపిణీ చేయూత అనే పథకం పేరుతో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణలో పోడు భూములన్ని గిరిజనులకు అప్పగిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
తమ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ముందు నుంచి చెబుతూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సభ వేదిక పైన కూడా ధరణి పోర్టల్ పై రాహుల్ గాంధీ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్లో రైతు డిక్లరేషన్ ను మరియు హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
యూత్ డిక్లరేషన్ లో భాగంగా నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అందించినట్లు గతంలో ప్రియాంక గాంధీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ లో భాగంగా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది.
ఇక ఇప్పటికే వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది.
Leave a Reply