ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా మనం పరిగణిస్తాం. ఈ మేరకే మన దేశంలో అదే విధంగా రాష్ట్రాలలో బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. బ్యాంకులు ఇతర కంపెనీలలో అన్నిటికి కూడా Financial లేదా Fiscal Year ని ప్రామాణికంగా తీసుకుంటారు.
దీనివలన ఏప్రిల్ 1 నుంచి ఎన్నో మార్పులు మనకి కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా బడ్జెట్ మరియు బడ్జెట్ లో పన్నుల పెంపు, సుంకాల వలన ధరలు పెరగటం లేదా తగ్గటం వంటివి జరుగుతాయి. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతాయి.
మరి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి, వేటి ధరలు తగ్గనున్నాయో ఒకసారి చూద్దాం.
ధరలు పెరిగే వస్తువులు ఇవే
ఏప్రిల్ 1 నుంచి ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు లేదా ఆభరణాలు, ప్లాటినం నగల ధరలు పెరుగుతాయి. వీటితో పాటు ఇమిటేషన్ నగలు,ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, సిగరేట్లు, ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి.
ధరలు తగ్గే వస్తువులు ఇవే
ఏప్రిల్ 1 నుంచి వజ్రాలు, రంగు రాళ్లు,టీవీలు, సైకిళ్లు, ఇంగువ,
కాఫీ గింజలు, మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లు, దుస్తులు, బొమ్మలు, కెమెరా లెన్స్లు, మన దేశంలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం
అయాన్ బ్యాటరీలు ఇందులో ఉన్నాయి.
ఇళ్లు కొనే వారికి మరింత భారం
ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్ళు కొనాలనుకునే వారికి మరింత భారం పడనుంది. పెరిగిన వడ్డీ రేట్లు మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత పెరగనున్న వడ్డీ రేట్ల భారంతో, ఇళ్ల రేట్లు ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.
ఇది చదవండి: ఏప్రిల్ 1 నుంచి వాహనదారులకు టోల్ భారం
భారీగా పెరగనున్న నిత్యావసర మందులు
జ్వరం , బీపి, రక్త హీనత, యాంటీ బోయేటిక్స్, విటమిన్ ట్యాబ్లెట్లు, డయాబెటిస్, గుండె జబ్బులకు సంబందించిన అత్యవసర ఔషదాల పై కేంద్రం 12% పెంచింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. దీంతో సామాన్యుడి పై మరింత భారం పడనుంది. నిత్యావసర మందుల ధరలు రానున్న నెలల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది చదవండి: బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటున్నారా అయితే కొన్ని రోజులు ఆగండి
ఇది చదవండి: దేశ చరిత్రలో తొలిసారి ఇంటి నుంచి ఓటు..Vote from Home
Leave a Reply